
వడ్ల కొనుగోళ్లపై కేంద్రం సమాధానం చెప్పకుండా రైతులను తప్పుదోవ పట్టిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు మంత్రి గంగుల కమలాకర్. వానాకాలం పంట కొనబోమని తాము చెప్పలేదన్నారు. ప్రతి గింజా కొంటామని చెబుతున్నా... బీజేపీ ఆందోళన చేయడం ఏంటని మండిపడ్డారు. ఎక్కడ కొనుగోలు జరగడం లేదో చెబితే తానే వచ్చి కొనిపిస్తానన్నారు. వానాకాలం పంట కొనుగోలులో సమస్యలేదన్నారు మంత్రి. పంటంతా కొని బియ్యంగా మార్చి ఇస్తామని.. అదంతా కేంద్రం కొనేలా కిషన్ రెడ్డి, బండి సంజయ్ బాధ్యత తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేదంటే వాళ్ల ఇండ్ల ముందు ధర్నా చేస్తామని హెచ్చరించారు.