3.11 లక్షల కొత్త రేషన్‌‌‌‌ కార్డులు ఇచ్చినం

3.11 లక్షల కొత్త రేషన్‌‌‌‌ కార్డులు ఇచ్చినం

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో 3.11లక్షల కొత్త రేషన్‌‌‌‌ కార్డులు జారీ చేసినట్లు రాష్ట్ర సివిల్‌‌‌‌ సప్లయ్స్‌‌‌‌శాఖ మంత్రి గంగుల కమలాకర్‌‌‌‌ తెలిపారు. గురువారం శాసనసభలో ఎమ్మెల్యేలు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానం చెప్పారు. రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు 6.71లక్షల కొత్త రేషన్ కార్డులు ఇచ్చామని తెలపారు. కట్‌‌‌‌ ఆఫ్‌‌‌‌ డేట్‌‌‌‌ పెట్టి అప్లికేషన్లు తీసుకున్నామని, వాటి ప్రకారం కొత్త కార్డులు ఇచ్చామన్నారు. అప్లికేషన్ విధానం నిరంతరం ప్రక్రియ అని మంత్రి గుర్తు చేశారు. రాష్ట్రంలో 90.49 లక్షల కార్డులు, 2 కోట్ల 87లక్షల 68 వేల మంది లబ్ధిదారులు ఉన్నారని పేర్కొన్నారు. తీవ్ర కరోనా సంక్షోభంలోనూ కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలకు నిధులు ఆపలేదని, అర్హులైన ప్రతి ఒక్కరికీ స్కీం అమలు చేశామని మంత్రి వివరించారు. రాష్ట్రంలో కళ్యాణలక్ష్మీ, షాదీముబాఆర్ పథకాల అమలుకు ఇప్పటి వరకు రూ.7,722.80 కోట్లు ఖర్చు చేశామని మంత్రి తెలిపారు.