పర్యావరణ పరిరక్షణకోసం ప్రజలు చెట్లు నాటాలన్న మంత్రి

పర్యావరణ పరిరక్షణకోసం ప్రజలు చెట్లు నాటాలన్న మంత్రి

పర్యావరణ పరిరక్షణకు ప్రజలందరూ చెట్లు నాటాలని అన్నారు మంత్రి గంగుల కమలాకర్. మంగళవారం కరీంనగర్ టౌన్ లో జరిగిన పట్టన ప్రగతి కార్యక్రమంలో మాట్లాడిన ఆయన.. గెలిపించిన ప్రజల రుణం తీర్చుకోవడానికే పట్టణ ప్రగతి ద్వారా ప్రజల ముందుకు వచ్చినట్లు తెలిపారు. క్షేత్రస్థాయిలో సమస్యలు తెలుసుకునేలా  డివిజన్ కమిటీలు వేశామని అన్నారు. ప్రతీ ఒక్కరూ పరిసరాల పరిశుభ్రత పాటించాలని… నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దాలని చెప్పారు.  నగర మార్పు ఒక్క అడుగుతోనే మొదలవుతుందని…. ప్లాన్ యువర్ డివిజన్ ప్రజల భాద్యతని, నిధులు తేవడం తమ బాధ్యతని చెప్పారు.

ఈ కార్యక్రమంలో మంత్రి కమలాకర్ తో పాటు ప్రణాళికా ఉపాధ్యక్షుడు బి.వినోద్ కుమార్ కూడా పాల్గొన్నారు.  . ప్రభుత్వ ఖాళీ స్థలాలను కాపాడాలని… కరీంనగర్ ను గొప్ప నగరంగా అభివృద్ధి చేయాలన్నదే తమ ధ్యేయమని చెప్పారు వినోద్.  గోదావరి జలాలు సముద్రం పాలు కాకుండా సీఎం కేసిఆర్ కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మించారని చెప్పారు. మిడ్ మానేరుతో కొదురుపాక వద్ద నీళ్ళు సముద్రాన్ని తలపిస్తున్నాయని అన్నారు.  పట్టణ ప్రగతే తెలంగాణ ప్రగతని… రాబోయే పదేళ్లలో పల్లెలకు, పట్టణాలకు తేడా ఉండదని అన్నారు. ప్రజలకు మెరుగైన విద్య, వైద్యం కోసం రాబోయే రోజుల్లో బస్తీ దవాఖానలు, ఢిల్లీ తరహాలో బస్తీ పాఠశాలలు ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో.. మేయర్ సునీల్ రావు, కమిషనర్ క్రాంతి, కార్పోరేటర్లు పాల్గొన్నారు.