వాడిని రెండు సంపి పంపించండి

V6 Velugu Posted on Jul 10, 2021

రాష్ట్రంలో మంత్రులు నోరు పారేసుకుంటున్నారు. ప్రశ్నిస్తే చిరాకు పడుతున్నారు. ఇప్పటికే మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మహిళా ఎండీడీవోపై నోరు జారారు. ఇప్పుడు మరో మంత్రి గంగుల కమలాకర్ కామెంట్స్ హట్ టాపి అయ్యాయి.  కరీంనగర్ SRR కాలేజీ గ్రౌండ్ లో భవన నిర్మాణ పనుల పరిశీలనకు వెళ్లారు.  అయితే ఇది కాలేజీ స్థలమని, ఇక్కడ ఏలాంటి నిర్మాణాలు జరపొద్దని ఓ విద్యార్థి గంగులకు రిక్వెస్ట్ చేశారు. దీంతో ఒక్కసారిగా గంగుల సీరియస్ అయ్యారు.  నీ ఊరు ఎక్కడంటూ విద్యార్థిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ స్థలం SRR కాలేజీది కాదని, స్పోర్ట్ అథారిటీదని, తెలియకపోతే తెలుసుకోవాలని మండిపడ్డారు. వాడ్ని ఇక్కడి నుంచి తీసుకెళ్లి రెండు సంపి పంపించండని పోలీసులకు ఆర్డరేశారు మంత్రి గంగుల.

 

Tagged Minister Gangula Kamalakar, land issue, Threaten, Student

Latest Videos

Subscribe Now

More News