వలస కూలీలకు బియ్యం, నగదు అందజేసిన మంత్రి హరీశ్

వలస కూలీలకు బియ్యం, నగదు అందజేసిన మంత్రి హరీశ్

రాష్ట్రంలో లాక్ డౌన్ కొనసాగుతుండటంతో వలస కూలీలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉపాధి లేక ఆకలితో అలమటిస్తున్నారు. అయితే వలస కూలీల ఆకలి తీర్చడం తమ బాధ్యతన్నారు మంత్రి హరీశ్ రావు. సీఎం కేసీఆర్ ఆదేశాలతో ఇవాళ(మంగళవారం) ఉదయం మొదటి విడతలో జిల్లా కేంద్రమైన సిద్ధిపేట- మందపల్లి గ్రామ శివారులో ఏర్పాటు చేసిన డీఎక్స్ఎన్ పరిశ్రమ దగ్గర ఉన్న క్యాంపులో ఉన్న 360 మందికి , నర్సాపూర్ డబుల్ బెడ్ రూమ్ దగ్గర క్యాంపులోని 320 మంది, అదే విధంగా గజ్వేల్ పట్టణ శివారు ముట్రాజ్ పల్లి క్యాంపులో 680 మందికి, మర్కుక్ లోని క్యాంపులో 300 మందికి, తునికి-బొల్లారం క్యాంపులో 600 మందికి మొదటి విడతగా ఏర్పాటు చేసిన క్యాంపులో ఆయన స్వయంగా వలస కూలీలకు 12 కిలోల బియ్యం, రూ.500 రూపాయల నగదును అందజేశారు. జిల్లాలోని వివిధ ప్రాజెక్టు సైట్లలో మొత్తంగా పని చేసే 10 వేల 300 మంది వలస కార్మికులు ఉన్నారని అందరికీ అందజేస్తామని మంత్రి హరీశ్ చెప్పారు.