1140 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు రెండురోజుల్లో నోటిఫికేషన్

1140 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు రెండురోజుల్లో నోటిఫికేషన్

మెడికల్ ఫీల్డ్ అంటే.. డైలీ అప్డేట్ అవుతుండాలని మంత్రి హరీష్ రావు అన్నారు. నిమ్స్ ఆస్పత్రిలో ఇన్ఫెక్షన్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ ట్రైనింగ్ ప్రోగ్రాంను ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో 30 టీచింగ్ హాస్పిటల్స్ నుంచి డాక్టర్లు, నర్సులు పాల్గొన్నారు. ఆస్పత్రుల్లో ఇన్ఫెక్షన్ కంట్రోల్ కు 3 టైర్ సిస్టం ఏర్పాటు చేస్తున్నామన్నారు. ప్రతి ఆస్పత్రిలో ఒక 3 మెన్ కమిటీ ఉంటుందని..ఈ కమిటీ మీటింగ్ ప్రతి సోమవారం ఉంటుందని తెలిపారు. 30 టీచింగ్ హాస్పిటల్స్కు రెండు రోజుల ట్రైనింగ్ ఉంటుందని.. దీనికి ఎవరు మిస్ కావొద్దని సూచించారు.  

ప్రతి రెండేళ్లకు ఓసారి ఇలాంటి ట్రైనింగ్ పెట్టమని అధికారులకు సూచించినట్లు హరీష్ రావు చెప్పారు. ఆపరేషన్ థియేటర్స్, డయాలసిస్ వార్డ్స్, లేబర్ రూమ్స్లలో ఇన్ఫెక్షన్ ఉంటుందని.. ఇన్ఫెక్షన్ కంట్రోల్కి వెనకాడొద్దని చెప్పారు. ఆస్పత్రుల్లో ఎక్విప్మెంట్ పాడైతే ఆలస్యం చేయకుండా రిపేర్స్ చేస్తున్నామని తెలిపారు. ఎక్విప్మెంట్ మేనేజ్మెంట్ కి ఏడాదికి 20 కోట్లు ఖర్చు అవుతుందన్న ఆయన..గర్భవతుల కోసం 56 హై ఎండ్ అల్ట్రా సౌండ్ మిషన్స్ కొనుగోలు చేస్తున్నట్లు చెప్పారు. రేడియాలజిస్టుల కొరత ఉండడంతో గైనకాలజిస్టులకు ట్రెనింగ్ ఇస్తున్నామని వివరించారు. 

కార్పోరేట్ ఆస్పత్రుల్లో ఉండే అన్ని సౌకర్యాలను ప్రభుత్వాసుపత్రుల్లో అందుబాటులో ఉంచుతున్నామని హరీష్ రావు తెలిపారు. 1140 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు రెండు రోజుల్లో నోటిఫికేషన్ ఇస్తామన్నారు. అన్ని వసతులు కల్పిస్తన్నాం..రోగులు  సంతృప్తి చెందేలా ట్రీట్మెంట్ చేయాలని వైద్యులకు సూచించారు. డిజిటల్ ప్లాట్ఫామ్ లో డాక్టర్స్ వర్క్ ను మానిటర్ చేస్తున్నామని..వారి పనికి తగిన ప్రతిఫలం ఉంటుందన్నారు. లక్షకుపైగా హెల్త్ ఉద్యోగులు ఉన్నారన్న ఆయన..వారిలో 1 శాతం మంది పని చెయ్యడం లేదని..దీనివల్ల అందరికీ చెడ్డపేరు వపస్తున్నట్లు తెలిపారు