V6 News

నేనున్నానంటూ భరోసా.. తల్లిదండ్రిని కోల్పోయిన బాలికకు అండగా మంత్రి కోమటిరెడ్డి

నేనున్నానంటూ భరోసా.. తల్లిదండ్రిని కోల్పోయిన  బాలికకు అండగా మంత్రి కోమటిరెడ్డి

నిర్మల్ జిల్లా తానుర్ మండలం బెల్తరోడ గ్రామానికి చెందిన దుర్గ అనే చిన్నారి తల్లి, తండ్రిని కోల్పోయి అనాథ అయ్యింది. ఈ విషయం తెలుసుకున్న మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి  మానవత్వం చాటుకున్నారు.  తానున్నానంటూ  భరోసా కల్పించారు. ప్రతిక్ రెడ్డి ఫౌండేషన్ ద్వారా  లక్ష రూపాయలను  తహసీల్దార్ లింగమూర్తి, MPDO అబ్దుల్ సమాద్ ద్వారా బాలికకు అందించారు.

 ఆర్థిక చేయూతను అందించి  చిన్నారికి విద్యపరంగా ఉచితంగా అన్ని సౌకర్యాలు కల్పించి పెళ్ళి అయ్యేవరకు బాధ్యత వహిస్తానని హామీ ఇచ్చారు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. ఖర్చులకు  ప్రతి నెల డబ్బు పంపుతానని చెప్పారు.  ఉండడానికి ఇల్లు కూడా సమకూరుస్తామని వెల్లడించారు. ఈ మేరకు   పాపతో మంత్రి కోమటి రెడ్డి విడియో కాల్ చేసి మాట్లాడి ధైర్యం చెప్పారు. అధర్య పడవద్దు,తాను ఉన్నానని భరోసా కల్పించారు. త్వరలో పాపను కలుస్తానని  చెప్పారు