V6 News

‘వెలుగు’ కథనానికి స్పందించిన మంత్రి కేటీఆర్

‘వెలుగు’ కథనానికి స్పందించిన మంత్రి కేటీఆర్

ఇరాక్‌లో చిక్కుకున్నతెలంగాణోళ్లను కాపాడున్రి

కేంద్ర మంత్రి జైశంకర్ కు మంత్రి కేటీఆర్ విజ్ఞప్తి 

‘వెలుగు’ కథనాన్ని ట్విట్టర్ లో ట్యాగ్ చేసిన మంత్రి

హైదరబాద్, వెలుగు: ఇరాక్‌లో చిక్కుకుపోయిన తెలంగాణ వాసులను వెనక్కి తీసుకు రావడంలో సాయం అందించాలంటూ విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ కు రాష్ట్ర మంత్రి కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. గురువారం ‘ఇరాక్ లో చిక్కుకుపోయిన్రు’ శీర్షికతో ‘వెలుగు’లో పబ్లిష్​అయిన కథనాన్ని సంతోష్ ఏసీఆర్ఎన్ అనే వ్యక్తి డైనమిక్ ఐటీ లీడర్షిప్ ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా మంత్రి కేటీఆర్ కు ట్యాగ్ చేశారు. దీంతో స్పందించిన మంత్రి కేటీఆర్.. కేంద్ర మంత్రి జైశంకర్ ను ట్యాగ్ చేస్తూ రిక్వెస్ట్ చేశారు. బాధితులను ఆదుకునేందుకు సాయం చేసేలా బాగ్దాద్ లోని ఇండియన్ ఎంబసీని ఆదేశించాలని కోరారు.