ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్​ కాళేశ్వరం

ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్​ కాళేశ్వరం
  •     ఈ ప్రాజెక్టుకు అమెరికాలో ఎండ్యూరింగ్ ఆఫ్​ ఇంజనీరింగ్ ప్రోగ్రెస్ అవార్డు : కేటీఆర్


హైదరాబాద్, వెలుగు: ప్రపంచంలోనే అతి పెద్ద లిఫ్ట్​ఇరిగేషన్ ​ప్రాజెక్టు కాళేశ్వరం అని మంత్రి కేటీఆర్​ అన్నారు. అమెరికన్​సొసై టీ ఆఫ్​ సివిల్ ​ఇంజనీర్స్​ఈ ప్రాజెక్టుకు ‘ఎం డ్యూరింగ్ ​సింబల్​ఆఫ్ ​ఇంజినీరింగ్ ప్రోగ్రెస్’​ అవార్డును సోమవారం అమెరికాలోని నేవె డ రాష్ట్రం హెండర్సన్​నగరంలో ప్రదానం చేసింది. మంత్రి కేటీఆర్ ​రాష్ట్ర ప్రభుత్వం తరపున ఈ అవార్డు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్​ మేధస్సుకు దక్కిన అపూర్వమైన గుర్తింపు ఈ అవార్డు అని పేర్కొన్నారు. దేశంలోనే తొలిసారిగా ఇంటింటికీ మంచినీళ్లు అందిస్తున్న రాష్ట్రంగా నిలిచిందన్నారు. సముద్ర మట్టానికి 90 మీటర్ల ఎత్తు నుంచి 618 మీటర్ల ఎత్తుకు ఈ ప్రాజెక్టు ద్వారా నీళ్లు ఎత్తిపోస్తున్నామన్నారు. ఇంత పెద్ద ప్రాజెక్టుతోనే తెలంగాణ భారతదేశ ధాన్యాగారంగా మారిందన్నారు.