హైదరాబాద్, వెలుగు: ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై బీజేపీ నేతలు దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఈ పథకాన్ని అమలు చేస్తున్నారో.. లేదో చెప్పాలని డిమాండ్ చేశారు. విద్యార్థులపై బీజేపీ నేతలకు నిజంగా ప్రేముంటే దేశవ్యాప్తంగా ఫీజు రీయింబర్స్‌మెంట్ అమలు చేసేలా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని ఆదివారం ఒక ప్రకటనలో కోరారు.
ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల నెపంతో సీఎం రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్న బీజేపీ నేతలు ముందుగా తాము అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పాలన్నారు. ఈ బకాయిలు ఒక్కరోజులో ఏర్పడినవి కావని, గత బీఆర్ఎస్ హయాంలో పేరుకుపోయినవేనని స్పష్టం చేశారు. కేసీఆర్ పాలనలో ఫీజు బకాయిలు పెట్టినప్పుడు బీజేపీ నేతలు ఎందుకు ప్రశ్నించలేదని నిలదీశారు.
