టెన్త్ ఎగ్జామ్ రిజల్ట్స్ ను మంత్రి సబితా ఇంద్రారెడ్డి రిలీజ్ చేశారు. ఈ సారి ఫలితాల్లో బాలికలు హవా సృష్టించారు. బాలికలు 92.45 శాతం ఉత్తీర్ణత సాధించారు. అబ్బాయిలు 87.61 శాతం పాసయ్యారు. ఓవర్ ఆల్ గా 90 శాతం విద్యార్థులు పాసయ్యారని సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. మొత్తం 3007 పాఠశాలలు 100 శాతం ఉత్తీర్ణత సాధించిగా.. 15 పాఠశాలల్లో సున్నా శాతం ఫలితాలు సాధించాయి. ఆగస్ట్ 1 నుంచి టెన్త్ అడ్వాన్సుడ్ సప్లిమెంటరీ పరీక్షలు జరగనున్నాయని తెలిపారు సబితా ఇంద్రారెడ్డి. విద్యార్ధులు ఎవరు ఆందోళనా చెందవద్దని.. పేరెంట్స్, టీచర్స్ పిల్లలకు అండగ ఉండాలని సూచించారు.
పదో తరగతి ఫలితాల్లో సిద్దిపేట జిల్లా 97.85 శాతం ఉత్తీర్ణత సాధించి మొదటి స్థానంలో నిలిచింది. హైదరాబద్ జిల్లా 79.63 శాతం ఫలితాల్లో చివరి స్థానంలో ఉంది. రాష్ట్రవ్యాప్తంగా 5 లక్షలకు పైగా విద్యార్థులు టెన్త్ ఎగ్జామ్స్ రాశారు. 70 శాతం సిలబస్ తో పాటు, ఎగ్జామ్ పేపర్లను 11 నుంచి ఆరుకు తగ్గించారు.
