నూతన పింఛన్ల పంపిణీ చేసిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి

నూతన పింఛన్ల పంపిణీ చేసిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి

అర్హులైన ప్రతీ ఒక్కరికి ఆసరా పింఛన్లు అందిస్తామని మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్ల పంపిణీ ప్రక్రియ జరుగుతోందని..పెండింగ్లో ఉన్న దరఖాస్తులను పరిశీలించి త్వరలో వారికి పింఛన్లు అందిస్తామన్నారు. రంగారెడ్డి జిల్లాలో కొత్తగా 54వేల మందికి పింఛన్లు మంజూరయ్యాయని..వారందరికి పింఛన్లు అందిస్తామన్నారు. 

పింఛన్ల పంపిణీ..


రంగారెడ్డి జిల్లా మీర్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్లో పర్యటించిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి..లబ్దిదారులకు నూతన పింఛన్ కార్డులను పంపిణీ చేశారు. వయోవృద్ధులు, వితంతులు, వికలాంగులు, ఒంటరి మహిళలకు నూతన పింఛన్ కార్డులను అందజేశారు. ఆసరా పెన్షన్లు అందిస్తున్న సీఎం కేసీఆర్కు మంత్రి సబితా ఇంద్రారెడ్డి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మేయర్ దుర్గా దీప్లాల్ చౌహన్, డిప్యూటీ మేయర్ తీగల విక్రం రెడ్డి, కమిషనర్ నాగేశ్వర్ రావు,  కార్పొరేటర్లు పాల్గొన్నారు.