ఒక్క హైటెక్ సిటీతోనే అభివృద్ధి జరిగిందా: మంత్రి సబితా

ఒక్క హైటెక్ సిటీతోనే అభివృద్ధి జరిగిందా: మంత్రి సబితా

ఒక్క హైటెక్ సిటీ కట్టి.. మొత్తం అభివృద్ధి తామే చేశామని చెప్పుకుంటున్నారని టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కరోనా సమయంలో తెలంగాణలోనే ఉన్న చంద్రబాబు ఒక్కసారైనా ప్రజలను కలిసే ప్రయత్నం చేశారా అని ఆమె ప్రశ్నించారు. కేసీఆర్‭ను ఇరుకున పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ఈడీ, సీబీఐ దాడులు చేయిస్తోందని మండిపడ్డారు. గవర్నర్ దగ్గర ఉన్న పెండింగ్ బిల్లులపై ఉన్న అనుమానాలపై క్లారిటీ ఇచ్చానని ఆమె అన్నారు. బిల్లులు ఆమోదం పొందగానే యూనివర్సిటీలో రిక్రూట్ మెంట్ ప్రక్రియ పూర్తి చేస్తామని మంత్రి సబితా హామీ ఇచ్చారు. 

తెలంగాణలో వరి ధాన్యం కోసం కల్లాలకు ఎందుకు పర్మిషన్ ఇవ్వడం లేదని మంత్రి సబితా కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రేపు ఇబ్రహీంపట్నం, వికారాబాద్‭లో బీఆర్ఎస్ నిరసన కార్యక్రమాలు చేపడుతున్నామని.. రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. రైతు అనుకూల విధానాలు అవలంభిస్తూ కేసీఆర్ ముందుకు వెళ్తుంటే.. రైతులకు వ్యతిరేకంగా మోడీ ప్రభుత్వం పనిచేస్తోందని ఆమె మండిపడ్డారు. రైతు ఆదాయాన్ని చూడకుండా పెట్టుబడి రెట్టింపు చేస్తున్నారని మోడీని విమర్శించారు.