పిల్లల దత్తతకు హెల్ప్​లైన్​ సెంటర్ ప్రారంభించిన మంత్రి సత్యవతి రాథోడ్‌‌

పిల్లల దత్తతకు హెల్ప్​లైన్​ సెంటర్ ప్రారంభించిన మంత్రి సత్యవతి రాథోడ్‌‌

హైదరాబాద్‌‌, వెలుగు: పిల్లలను దత్తత తీసుకోవాలని భావిస్తున్న వారి కోసం రాష్ట్ర సర్కార్ హెల్ప్‌‌ లైన్‌‌ సెంటర్‌‌‌‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. హైదరాబాద్‌‌ మధురానగర్‌‌‌‌లోని వుమెన్ అండ్ చైల్డ్ డెవలప్‌‌మెంట్ కమిషనర్ ఆఫీసులో మంత్రి సత్యవతి రాథోడ్‌‌ బుధవారం ఈ సెంటర్‌‌‌‌ను ప్రారంభించారు. సంతానం లేని తల్లిదండ్రులకు పిల్లలను దగ్గర చేయడం, తల్లిదండ్రులు లేని చిన్నారులకు కుటుంబాన్ని దగ్గర చేయడానికి ఈ కార్యక్రమాన్ని తలపెట్టామన్నారు. పిల్లలను దత్తత తీసుకోవాలనుకునే వారు 040–-23748663/040–-23748664కు కాల్ చేసి, దత్తత ప్రాసెస్‌‌ తెలుసుకోవచ్చని వెల్లడించారు.

ఆన్‌‌లైన్‌‌లో ఎలా రిజిస్టర్ చేసుకోవాలో, ఏయే అర్హతలు, సర్టిఫికెట్స్‌‌ ఉండాలో ఫోన్‌‌లో వివరిస్తారని చెప్పారు. ఇప్పటికే పిల్లలను దత్తత తీసుకున్న వారికి కూడా ఈ హెల్ప్‌‌ లైన్ సెంటర్ ఉపయోగపడుతుందన్నారు. ఐదేండ్లు దాటిన పిల్లలను దత్తత తీసుకునే వారికి, ఆ పిల్లలతో ఎలా సర్దుకుపోవాలో హెల్ప్ డెస్క్ ద్వారా కౌన్సెలింగ్​ ఇస్తామన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో పిల్లలను దత్తత తీసుకోవడం కోసం 2 వేల మంది రిజిస్టర్ చేసుకోగా.. 38 మంది పిల్లలే అందుబాటులో ఉన్నారని, ఇంకో వంద మంది ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలున్నారని మంత్రి సత్యవతి రాథోడ్​ వెల్లడించారు.