హైదరాబాద్, వెలుగు: ముదిరాజ్‌లను బీసీ–-డీ కేటగిరీ నుంచి బీసీ– -ఏలోకి మార్చాలని రాష్ట్ర క్రీడాశాఖ మంత్రి వాకిటి శ్రీహరి ముదిరాజ్ బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్‌ను కోరారు. గురువారం ఆయన బీసీ కమిషన్ చైర్మన్‌ను కలిసి వినతి పత్రం అందచేశారు.
ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సమగ్ర సర్వే కులగణన ప్రకారం..ముదిరాజ్‌ల జనాభా 7.4 శాతంతో 26 లక్షల జనాభాకుపైనే ఉందని మంత్రి శ్రీహరి తెలిపారు. ముదిరాజ్ జాతి ఇప్పటికీ అన్ని రంగాల్లో వెనకబడి ఉందని మంత్రి స్పష్టం చేశారు. బీసీ–-డీ నుంచి ఏలోకి మారిస్తే భావి తరాలకు న్యాయం జరుగుతుందనిబీసీ కమిషన్ చైర్మన్‌కు వెల్లడించారు.
