రాహుల్ ఎవరో రాసిచ్చింది చదివి వెళ్లిపోయిండు: పువ్వాడ

రాహుల్ ఎవరో రాసిచ్చింది చదివి వెళ్లిపోయిండు:  పువ్వాడ

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై మంత్రులు వేముల ప్రశాంత్ రెడ్డి,పువ్వాడ అజయ్ కుమార్  మండిపడ్డారు. ఖమ్మంలో  రాహుల్ అవగాహన లేకుండా మాట్లాడారని..ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్ ను చదివి వెళ్లిపోయారని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో ఏ జరుగుతుందో తెలుసుకోకుండా రాహుల్ మాట్లాడారని అన్నారు.   ఏ హోదాలో రాహుల్ పెన్షన్ల గురించి  హామీ ఇచ్చారని. . కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో 4 వేల పెన్షన్ అమలవుతుందా? అని ప్రశ్నించారు.  తెలంగాణలో 4 వేల పెన్షన్ ఇస్తామంటున్న రాహుల్ ముందు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఇవ్వాలని సూచించారు,   కాంగ్రెస్  హయంలో జరిగినన్ని స్కాంలు  ఎక్కడా జరగలేదని ఆరోపించారు.  దేశ వ్యాప్తంగా కేసీఆర్ నాయకత్వం కోరుకుంటున్నారని..అన్నారు.

బీజేపీకి బీఆర్ఎస్ టీం  అనడంపై  గులాబీ నేతల ఆగ్రహం  వ్యక్తం చేశారు.  బీఆర్ఎస్ ఏ పార్టీకి బీం టీం కాదని కేసీఆర్ చెప్పారని మంత్రి వేముల అన్నారు.   బీజేపీ నేత ఈటల, కాంగ్రెస్ పీసీసీ చీఫ్  రేవంత్ రహస్య భేటీ నిజం కాదా? అని ప్రశ్నించారు.  హోటల్ లో రహస్య భేటీ ఫోటోలు చూపించమంటారా అని ప్రశ్నించారు. వాస్తవాలు తెలిసిస్తే  ఎవరు ఏవరికి  బీ టీమో అర్థమవుతుందన్నారు. 

కాంగ్రెస్ అధికారంలో  ఉన్నప్పుడు 24 గంటల కరెంట్ ఎందుకివ్వలేకపోయారని పువ్వాడ ప్రశ్నించారు. రైతుబంధు, రైతు బీమా ఎందుకివ్వలేదన్నారు.   కేసీఆర్ అమలు చేస్తున్న పథకాలు  దేశం ఆదర్శంగా తీసుకుంటుందన్నారు. అవినీతి డిక్షనరీ కాంగ్రెస్ పార్టీ అని.. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో తెలంగాణ తరహా పథకాలు ఎందుకులేవని ప్రశ్నించారు పువ్వాడ