లక్ష్యం, క్రమశిక్షణ ఉంటేనే లైఫ్ సక్సెస్..: మంత్రి వివేక్ వెంకటస్వామి

లక్ష్యం, క్రమశిక్షణ ఉంటేనే లైఫ్ సక్సెస్..: మంత్రి వివేక్ వెంకటస్వామి
  • రూ.75 లక్షల ప్యాకేజీతో జాబ్ వచ్చింది

విద్యార్థి దశ నుంచే ఒక స్పష్టమైన లక్ష్యాన్ని ఏర్పరుచుకుని, క్రమశిక్షణతో కష్టపడితే జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చని రాష్ట్ర కార్మిక, మైనింగ్ శాఖ మంత్రి డాక్టర్ గడ్డం వివేక్ వెంకటస్వామి స్పష్టం చేశారు. తల్లిదండ్రుల ఆశయాలను నిర్లక్ష్యం చేయొద్దని, ఎన్నో కష్టాలు పడి తమ పిల్లల కోసంచేసే త్యాగాలను గుర్తించాలని సూచించారు.

హైదరాబాద్ బాచుపల్లిలోని కేఎల్ హెచ్ యూనివర్శిటీ క్యాంపస్లో జరిగిన స్టూడెంట్ ఇంటరాక్టివ్ మీట్' పర్సనాలిటీ డెవలప్మెంట్' కార్యక్రమంలో మంత్రి వివేక్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏటా అందిస్తున్న వంద కోట్ల రూపాయల స్కాలర్ షిప్ పోస్టర్ను కేఎల్ వర్సిటీ డైరెక్టర్ జే శ్రీనివాస్ రావుతో కలిసి విడుదల చేశారు. విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన తన జీవిత ప్రయాణాన్ని విద్యార్థులతో పంచుకున్నారు.

రూ.75 లక్షల ప్యాకేజీతో జాబ్ వచ్చింది

కేఎల్ యూనివర్సిటీ విద్యార్థులు ప్లేస్మెంట్స్లో దూసుకుపోతున్నారని కేఎల్ యూనివర్సిటీ డైరెక్టర్ డాక్టర్ జె. శ్రీనివాసరావు అన్నారు. ఈ ఏడాది తమ విద్యార్థికి ఆపిల్ కంపెనీలో ఏకంగా రూ.75 లక్షల ప్యాకేజీతో జాట్నచ్చిం దని, ఇంకా అనేక మందికి లక్షల ప్యాకేజీలతో ఉద్యోగాలు వచ్చాయని తెలిపారు. యూనివర్సీ టీ తరపున ప్రతి ఏటా సుమారు రూ.100కోట్ల వరకు స్కాలర్షిప్స్ అందిస్తున్నామన్నారు మెరిట్ విద్యార్థులను ప్రోత్సహించే లక్ష్యంతో నేషనల్ ఎంట్రెన్స్ ఎగ్జామ్ నిర్వహిస్తున్నామని.

వివరించారు. విద్యారంగంతో పాటు అనేక రంగాల్లో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించే విద్యార్థులకు వందశాతం స్కాలర్ షిప్స్ అందిస్తున్నామని చెప్పారు. మంత్రి వివేక్ వెంకటస్వామి సొమ్ములని, రాజకీయాల్లో విలువలతో కూడిన ప్రయాణం చేస్తున్నారని కొనియాడారు. మంత్రి వివేక్ తండ్రి దివంగత నేత కాకా వెంకటస్వామి కూడా గొప్పరాజకీయ నేత అని గుర్తు చేశారు.

అట్రాక్షన్ డిస్ట్రాక్షన్స్ ఉంటయ్.. కానీ...

విద్యార్థి జీవితంలో ఎన్నో ఆకర్షణలు. డిస్ట్రాక్షన్స్ ఉంటాయని, అయితే వాటికి దూరంగా ఉంటూ చదువుపై ఫోకస్ పెట్టిన ప్పుడే సక్సెస్అవుతారని మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. 'లైఫ్ లో ఎదగడానికి షార్ట్ కట్స్ ఉండవు. హార్ట్ వర్క్, పట్టుదల, నిజాయితీ ఉంటేనే నిలబడగలం' అని అన్నారు. తాను వ్యాపారంలో, రాజకీయాల్లో ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నానని, ఆర్థిక క్రమశిక్షణ. టీమ్ వర్క్ తోనే వాటిని జయించానని తెలిపారు.

మెడిసిన్ టు పాలిటిక్స్.. నాన్నే స్ఫూర్తి

తాను హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో చదివి, ఆ తర్వాత మెడిసిన్ పూర్తి చేశానని మంత్రి వివేక్ వెంకటస్వామి గుర్తు చేసుకున్నారు. డాక్టర్గా కెరీర్ మొదలు పెట్టినా, తర్వాత వ్యాపార రంగంలోకి (విశాక ఇండస్ట్రీస్), అక్కడి నుంచి మీడియా రంగంలోకి (వీ6 న్యూస్, వెలుగు న్యూస్ పేపర్) అడుగు పెట్టి విజయవంతంగా వడిపిస్తున్నట్లు తెలిపారు.

తన తండ్రి. దివంగత నేత కారా వెంకటస్వామి స్ఫూర్తితోనే తామ రాజకీయాల్లోకి వచ్చానని, ఆయన చూపిన బాటలోనే ప్రజాసేవ చేస్తున్నారని వెల్లడించారు. తన తండ్రి కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు గ్రామీణాభివృద్ధికి, కార్మికుల సంక్షేమానికి చేసిన కృషిని ఈ సందర్భంగా గుర్తు చేశారు.

సొసైటీకి తిరిగివ్వాలి

కేవలం డబ్బు సంపాదించడమే కాకుండా సమా జానికి ఎంతో కొంత తిరిగివ్వడంలోనే నిజమైన సంతృప్తి ఉంటుందని మంత్రి వివేక్ వెంకటస్వా మి అన్నారు. తాను ఛారిటబుల్ ట్రస్ట్ ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సమస్యలు తీర్చా నని, గవర్నమెంట్ స్కూళ్లలో మౌలిక వసతులు కల్పించానని. ఇలా ఎన్నో సేవా కార్యక్రమాలు చేశానని చెప్పారు. స్వార్థం లేకుండా మరొకరికి మేలు జరగాలనే సంకల్పంతో పనులు చేసిన ప్పుడు కలిగే ఆనందం వెలకట్టలేనిదన్నారు.

సేవ ద్వారా వచ్చే సంతృప్తిజీవితాంతం ఉంటుందన్నా రు. తాను చెప్పడం కాదని, విద్యార్థులు ఎక్సపీరి యన్స్ చేయాలన్నారు. ప్రతి ఒక్కరూ జీవితాంతం తను తల్లిదండ్రులను గౌరవించాలన్నారు. ఈ సందర్భంగా మెరిట్ విద్యార్థులకు మంత్రి మెడల్స్, షీల్లులను అందజేసి సత్కరించారు. ఈ కార్యక్రమంలో వర్సిటీ సిబ్బంది, భారీ సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు.