గిగ్ వర్కర్ల బిల్లుపై కీలక వ్యాఖ్యలు చేశారు మంత్రి వివేక్ వెంకటస్వామి. సోమవారం ( మార్చి 30 ) అసెంబ్లీలో మాట్లాడుతూ ఈమేరకు కీలక వ్యాఖ్యలు చేశారు.గిగ్ వర్కర్లను పట్టించుకోకపోతే అగ్రిగేటర్లకు పెనాల్టీ వేస్తామని అన్నారు. గిగ్ వర్కర్లతో స్వయంగా మాట్లాడి డ్రాఫ్ట్ బిల్లు రెడీ చేశామని అన్నారు మంత్రి వివేక్. గిగ్ వర్కర్ల డ్రాఫ్ట్ బిల్లుపై కంపెనీలతో 5 సార్లు మీటింగులు పెట్టమని...చట్టం తీసుకొస్తే కంపెనీలకు ఎలాంటి నష్టం ఉండదని వివరించామని అన్నారు. గిగ్ వర్కర్లకు ప్రభుత్వం అండగా స్పష్టం చేశారు మంత్రి వివేక్.
నెల రోజులు డ్రాఫ్ట్ బిల్లును జనంలో చర్చకు పెట్టమని అన్నారు. డ్రాఫ్ట్ బిల్లుపై సలహాలు సూచనలు తీసుకున్నామని..65 సలహాలు వచ్చాయని అన్నారు మంత్రి వివేక్. గిగ్ వర్కర్లు అగ్రిగేటర్లు, అధికారులతో కమిటీ వేస్తామని అన్నారు. గిగ్ వర్కర్లు రిజిస్ట్రేషన్ చేసుకోవడం తప్పనిసరి అని... రిజిస్ట్రేషన్ చేసుకుంటేనే యూనిక్ ఐడీ వస్తుందని స్పష్టం చేశారు మంత్రి వివేక్.
►ALSO READ | చదువుకోవాలని ఉంది.. సమస్య పరిష్కరించాలని.. ప్రజావాణిని ఆశ్రయించిన బాలిక
గిగ్ వర్కర్ల బిల్లుపై ఇంటర్నల్ డిస్ప్యూట్ కమిటీ కూడా ఏర్పాటు చేస్తామని అన్నారు. గిగ్ వర్కర్లను పట్టించుకోకపోతే అగ్రిగేటర్లకు పెనాల్టీ వేస్తామని..మొదటిసారి తప్పు చేస్తే రూ. 50 వేలు, రెండోసారి రూ. లక్ష, మూడోసారి తప్పు చేస్తే రూ. లక్షా 50 వేలు పెనాల్టీ విధిస్తామని స్పష్టం చేశారు మంత్రి వివేక్. గిగ్ వర్కర్ల కోసం ప్రత్యేకంగా సంక్షేమ నిధి ఏర్పాటు చేస్తామని అన్నారు. ఫిర్యాదుల కోసం గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేస్తామని అన్నారు.
