చదువుకోవాలని ఉందంటూ.. ప్రజావాణిని ఆశ్రయించింది ఓ బాలిక. జగిత్యాల జిల్లాలో జరిగింది ఈ ఘటన. సోమవారం ( మార్చి 30 ) జరిగిన ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి.. జగిత్యాల జిల్లా కేంద్రంలోని పురాణిపేట గవర్నమెంట్ స్కూల్లో 7వ తరగతి చదువుతున్న గ్రీష్మ అనే బాలిక ప్రజావాణిని ఆశ్రయించింది. తాను ఇంతకముందు చదివిన స్కూల్లో టీసీ ఇవ్వడంలేదంటూ ప్రజావాణిలో ఆవేదన వ్యక్తం చేసింది గ్రీష్మ.
తల్లి అనారోగ్యంతో బాధపడుతూ ఉండటంతో, ఇంటి బాధ్యతలన్నీ తన భుజాలపై పడిపోయాయని...సరిగ్గా పాఠశాలకు హాజరు కాలేకపోయానని ఆవేదన వ్యక్తం చేసింది బాలిక. ఇంతకుముందు చదివిన స్కూల్లో టీసీ ఆలస్యంగా రావడంతో, ఇంటి దగ్గర ఉన్న మరో ప్రభుత్వ పాఠశాలలో జాయిన్ చేసుకోవడానికి నిరాకరించారని తెలిపింది గ్రీష్మ. పరీక్షలు దగ్గరపడుతున్నాయని, తనకు చదువుకోవాలనే ఆసక్తి ఉందని గ్రీష్మ తెలిపింది.
►ALSO READ | ప్రైవేట్ స్కూల్స్ ఫీజుల పెంపుపై పేరెంట్స్ ఆందోళనలు
ఎలాగైనా తనకు పరీక్షలు రాసే అవకాశం ఇవ్వండి అంటూ కలెక్టర్‌ను వేడుకుంది గ్రీష్మ. బాలిక అభ్యర్థనకు స్పందించిన కలెక్టర్ సత్య ప్రసాద్...జిల్లా విద్యాశాఖ అధికారి రాముతో మాట్లాడి సమస్యను త్వరగా పరిష్కరించాలని ఆదేశాలు జారీ చేశారు. సంబంధిత ఉపాధ్యాయులతో మాట్లాడిన DEO రాము.. విద్యార్థిని పరీక్ష రాసేలా చొరవ తీసుకోవాలని సూచించారు.
