- నేడు 100 ప్లాట్లు వేలం వేయనున్న హెచ్ఎండీఏ
- రూ. 300 కోట్ల ఆదాయంపై కన్ను
హైదరాబాద్‌సిటీ, వెలుగు: మేడిపల్లిలో 63 ప్లాట్ల అమ్మకాల ద్వారా రూ.120 కోట్లను ఆర్జించిన హెచ్ఎండీఏ సోమవారం నుంచి రెండు రోజుల పాటు రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలం మోకిలాలో100 ప్లాట్లను వేలం వేయనున్నది. సర్వేనెం. 96/పిలోని 65. 37 గుంటల భూమిలో అపార్ట్మెంట్స్, ఇండిపెండెంట్ ఇండ్లు నిర్మించుకునేందుకు వీలుగా 1293 ప్లాట్లను అభివృద్ధి చేసింది. ఇప్పటికే కరెంట్, రోడ్లు, అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ, వాటర్ సప్లయ్, ఓవర్‌హెడ్ ట్యాంక్ నిర్మాణం, స్ట్రామ్ వాటర్ డ్రెయిన్, స్ర్టీట్లైట్స్, వంటి రకాల మౌలిక సదుపాయాలను కల్పించింది. ఇందులో 100 ప్లాట్లను వేలం వేయనునండగా, ఒక్కో ప్లాట్‌ను 300 చ. గ.ల నుంచి 500 చ.గ. సైజుల్లో అభివృద్ధి చేశారు. చ. గజానికి కనీస ధర రూ.50వేలుగా నిర్ణయించారు.
ప్రత్యేకతలివే..
ఈ లేఔట్‌కు 100 అడుగుల రోడ్లు ఉండడం ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు. పరిసరాల్లో కూడా ఆరు 100 ఫీట్ల రోడ్లు ఉన్నాయి. ఇక్కడి నుంచి రేడియల్ రోడ్-7కు చాలాసులభంగా చేరుకోవచ్చు. శంకరపల్లి నుంచి సమీపంలోని కోకాపేటలోని నియోపోలిస్ లేఔట్‌కు, విప్రోకు ఈజీగా వెళ్లొచ్చు. శంకర్పల్లి నుంచి నుంచి ఉన్న క్రాస్రోడ్లను కీలక ప్రాంతాలకు లింక్చేశారు. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌కు 20 నిమిషాల్లోనే చేరుకోవచ్చు. ఓఆర్ఆర్ ఎగ్జిట్-2కు చాలా దగ్గరలోనే ఉండడం వల్ల ధర ఎక్కువొస్తుందని హెచ్ఎండీఏ భావిస్తోంది. సమీపంలోనే అనేక ప్రీమియం గేటెడ్ కమ్యూనిటీలు, హోటళ్లు, ఇక్ఫాయ్ఏ, ఇండస్ ఇంటర్నేషనల్ స్కూల్, సీబీఐటీ, ఎంజీఐటి ఉండడంతో ప్లాట్లు హాట్ కేకుల్లా అమ్ముడవుతాయని అనుకుంటున్నారు. ఈ వేలం ద్వారా కనీసం రూ.300 కోట్ల ఆదాయం అంచనా వేస్తున్నారు.
