ఈ వారం రెండు ఐపీఓలు.. రూ.600 కోట్లు సేకరించనున్న కంపెనీలు

ఈ వారం రెండు ఐపీఓలు.. రూ.600 కోట్లు సేకరించనున్న కంపెనీలు

న్యూఢిల్లీ: ఈ వారం రెండు మెయిన్‌‌బోర్డ్ ఐపీఓలు ఇన్వెస్టర్ల ముందుకు రానున్నాయి.  టెక్స్‌‌టైల్, ప్యాకేజింగ్ రంగాలకు చెందిన ఆస్తా స్పింటెక్స్, క్రాక్ ప్యాకేజింగ్ కంపెనీలు కలిపి సుమారు రూ.600 కోట్లు సేకరించనున్నాయి. 

ఆస్తా స్పింటెక్స్: ఈ ఐపీఓ జూన్ 29న ప్రారంభమై, జులై 1న ముగుస్తుంది.  ఒక్కో షేరు ధరను రూ. 125 నుంచి రూ. 136 గా కంపెనీ నిర్ణయించింది. ఈ ఇష్యూ సైజ్‌‌ రూ. 170 కోట్లు. ఇందులో ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్‌‌ఎస్‌‌) ఏమీ లేదు. మొత్తం 1.25 కోట్ల ఫ్రెష్ ఈక్విటీ షేర్లను కంపెనీ అమ్ముతుంది. 

నాక్ ప్యాకేజింగ్:  ఈ ఐపీఓ జులై 1న ప్రారంభమై, జులై 3న ముగుస్తుంది. ఒక్కో షేరు ధరను రూ. 161 నుంచి రూ. 170 గా ఫిక్స్ చేశారు. ఈ మెయిన్‌‌బోర్డ్ ఐపీఓ మొత్తం విలువ రూ. 439.50 కోట్లు. ఇందులో రూ. 380 కోట్ల విలువైన 2.24 కోట్ల ఫ్రెష్‌‌ షేర్ల ఇష్యూతో  పాటు, ప్రస్తుత ప్రమోటర్లు  రూ. 59.50 కోట్ల విలువైన ఓఎఫ్‌‌ఎస్‌‌ ఆఫర్ ఉంది.