హెచ్ఎంలు, స్కూల్ అసిస్టెంట్లకు గుడ్ న్యూస్..  202 పోస్టులకు నోటిఫికేషన్

హెచ్ఎంలు, స్కూల్ అసిస్టెంట్లకు గుడ్ న్యూస్..  202 పోస్టులకు నోటిఫికేషన్
  •     డిప్యుటేషన్ ప్రాతిపదికన హెచ్ఎంలు, స్కూల్ అసిస్టెంట్లకు చాన్స్‌‌‌‌ 

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని డైట్, ఎస్సీఈఆర్టీ తదితర విద్యా సంస్థల్లో ఖాళీగా ఉన్న 202 పోస్టులను భర్తీ చేసేందుకు స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చర్యలు ప్రారంభించింది. ఈ మేరకు ఆదివారం స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ డాక్టర్ ఇ. నవీన్ నికోలస్ నోటిఫికేషన్ విడుదల చేశారు. సర్కారు, లోకల్ బాడీ స్కూళ్లలో పనిచేస్తున్న ఇన్–సర్వీస్ గెజిటెడ్ హెడ్ మాస్టర్లు, స్కూల్ అసిస్టెంట్లు ఈ పోస్టులకు డిప్యుటేషన్ ప్రాతిపదికన దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా డైట్ కాలేజీల్లో 131, సీటీఈ కాలేజీల్లో 36, ఐఏఎస్ఈలో 17, ఎస్సీఈఆర్టీలో 18 పోస్టులు భర్తీ చేయనున్నారు.

ఫారిన్ సర్వీస్ నిబంధనల ప్రకారం ఈ డిప్యుటేషన్లు ఉంటాయని అధికారులు వెల్లడించారు. జులై 4 నుంచి 14 వరకూ ఆన్ లైన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. జులై 17న దరఖాస్తులకు ఎడిట్ ఆప్షన్ ఇవ్వగా, జులై 25 నుంచి 31 వరకూ హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఆన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో పరీక్షలు నిర్వహించనున్నారు. ఇంటర్వ్యూ అండ్ డెమోలను ఆగస్టు 6 నుంచి 8 వరకు తీసుకుంటారు. ఎంపికైన వారికి ఆగస్టు 10న డిప్యూటేషన్ ఆర్డర్లు ఇవ్వనున్నారు. అర్హత ప్రమాణాలు, సిలబస్, ఖాళీల పూర్తి వివరాల కోసం అభ్యర్థులు విద్యాశాఖ అధికారిక వెబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సైట్ https://schooledu.telangana.gov.in ను సందర్శించాలని డైరెక్టర్ సూచించారు.