స్థానిక సంస్థల్లో కాంగ్రెస్ జెండా ఎగరాలి: మంత్రి వివేక్ వెంకటస్వామి

స్థానిక సంస్థల్లో కాంగ్రెస్  జెండా ఎగరాలి: మంత్రి వివేక్ వెంకటస్వామి

స్థానిక సంస్థల్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేయాలన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి.   కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలన్నారు. మూడో విడత స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా చెన్నూరు నియోజకవర్గంలో విస్తృతంగా ప్రచారం చేశారు వివేక్.  కోటపల్లి మండలంలోని కొండంపేట, మల్లంపేట, నక్కపల్లి, కోటపల్లి గ్రామాల్లో కాంగ్రెస్ తరఫున ప్రచారం నిర్వహించారు. 

 కాంగ్రెస్ పార్టీ బలపరచిన సర్పంచ్, వార్డు అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని రిక్వెస్ట్ చేశారు.   గత ప్రభుత్వాలు గ్రామ పంచాయతీలను పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అన్నిటిని అమలు చేసిందని చెప్పారు

ప్రతీ ఒక్క అర్హుడికి కాంగ్రెస్ పార్టీ సంక్షేమ పథకాలు అందజేస్తుందన్నారు వివేక్.   మన గ్రామ పంచాయతీలు అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్ పార్టీ బలపరచిన అభ్యర్థులను గెలిపించుకోవాలన్నారు. నియోజకవర్గంలో ఇప్పటికే 200 కోట్ల రూపాయల అభివృద్ధి పనులు చేశామన్నారు. గ్రామాల్లో నీటి సమస్యలు లేకుండా బోర్లు వేసి నీరు అందించామన్నారు. గ్రామాల్లో డ్రైనేజీలు సీసీ రోడ్లు వేసి గ్రామాలను అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తున్నామని చెప్పారు వివేక్