మూడు నెలలుగా 200 మంది అత్యాచారం... 14 ఏళ్ళ బాలిక విషాద గాధ..

మూడు నెలలుగా 200 మంది అత్యాచారం... 14 ఏళ్ళ బాలిక విషాద గాధ..

14 ఏళ్ళ బాలికపై 200 మంది మూడు నెలలుగా అత్యాచారానికి పాల్పడ్డ ఘటన మహారాష్ట్రలో చోటు చేసుకుంది. మానవత్వాన్ని ప్రశ్నార్థకంగా మార్చేసిన ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి.. మహారాష్ట్రలోని పాల్గర్ జిల్లాలో చోటు చేసుకుంది ఈ ఘటన. 14 ఏళ్ల బంగ్లాదేశ్ బాలిక మూడు నెలల వ్యవధిలో కనీసం 200 మంది కామాంధులు తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని తమకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు పోలీసులు.

మీరా-భయందర్ వాసాయి-విరార్ పోలీసుల యాంటీ-హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్, ఎక్సోడస్ రోడ్ ఇండియా ఫౌండేషన్, హార్మొనీ ఫౌండేషన్ అనే స్వచ్ఛంద సంస్థలతో సంయుక్తంగా జూలై 26న వాసాయిలోని నైగావ్‌లోని ఒక ఫ్లాట్‌పై చేసిన దాడిలో ఈ బాలికను రక్షించినట్లు తెలిపారు పోలీసులు.

ఈ దాడిలో ఆరుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. పోలీసులు రక్షించిన ఐదుగురు బాధితుల్లో 14 ఏళ్ళ బంగ్లాదేశీ బాలిక సహా ముగ్గురు బంగ్లాదేశీయులు ఉన్నట్లు తెలిపారు పోలీసులు.అరెస్టయిన వారిలో 33, 32 ఏళ్ల వయస్సు గల ఇద్దరు మహిళలు ఉన్నారని.. వీరు బాలికను బంగ్లాదేశ్ ఇండియాకు తరలించేందుకు సహకరించినట్లు గుర్తించామని తెలిపారు పోలీసులు.

ఈ కేసుకు సంబంధించి ఇప్పటిదాకా పది మందిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు నైగావ్ పోలీసులు.14 ఏళ్ళ బాలిక ఇచ్చిన వాంగ్మూలం ప్రకారం.. ఆమెను మొదట గుజరాత్‌లోని నాడియాద్‌కు అక్రమ రవాణా చేశారని, అక్కడ ఆమె లైంగిక వేధింపులకు గురైందని తెలిపారు పోలీసులు.