V6 News

భగీరథ పైప్​లైన్లు వేయాలని.. ఖాళీ బిందెలతో నిరసన

భగీరథ పైప్​లైన్లు వేయాలని.. ఖాళీ బిందెలతో నిరసన

మహబూబాబాద్​​ అర్బన్​, వెలుగు: మహబూబాబాద్​ జిల్లా కేంద్రంలోని అన్ని కాలనీల్లో  మిషన్ భగీరథ పైపులైన్లు వేసి నీటి సౌకర్యం కల్పించాలని  సీపీఐ(ఎంఎల్​) న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో మున్సిపాలిటీ ఆఫీసు ముందు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సోమవారం కోర్టు సెంటర్ నుంచి ఇందిరా గాంధీ సెంటర్, నెహ్రూ సెంటర్, ప్రభుత్వ హాస్పిటల్​ మీదుగా మున్సిపాలిటీ ఆఫీసు వరకు ఖాళీ బిందెలతో భారీ ర్యాలీ నిర్వహించారు.

ఈ సందర్భంగా సీపీఐ(ఎంఎల్​) న్యూడెమోక్రసీ రాష్ట్ర నాయకుడు మండల వెంకన్నమాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మిషన్​ భగీరథ పైపులైన్లు ఇంటింటికీ వేస్తామని ప్రకటించి విఫలమైందని ఆరోపించారు. ఇప్పటికైనా అన్ని కాలనీల్లో తాగునీటి సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బొమ్మన బోయిన అనసూర్య, హలవత్ లింగన్న, లక్ష్మయ్య, సామ పాపయ్య, పర్వత కోటేశ్​, ఎండీ జబ్బార్, ఐలయ్య, గుండెల కృష్ణ, యాకయ్య, కవిత, బానోత్ దేవేందర్, చంద్రమౌళి, రజిత, అనిత, ఉపేందర్, ఉమా, లక్ష్మి, నాగరాజు, యాకాంబరం పాల్గొన్నారు.