V6 News

మూడేళ్ల తర్వాత తిరిగి టాప్ ర్యాంక్ కు మిథాలీ

మూడేళ్ల తర్వాత తిరిగి టాప్ ర్యాంక్ కు మిథాలీ

దుబాయ్‌‌: ఇండియా విమెన్స్ వన్డే టీమ్‌‌ కెప్టెన్‌‌ మిథాలీ రాజ్‌‌.. దాదాపు మూడేళ్ల తర్వాత ఐసీసీ వన్డే బ్యాట్స్‌‌విమెన్ ర్యాంకింగ్స్‌‌లో నంబర్‌‌ వన్‌‌ ర్యాంక్​ కైవసం చేసుకుంది.  ఐసీసీ మంగళవారం రిలీజ్‌‌ చేసిన లిస్ట్‌‌లో మిథాలీ టాప్‌‌ ప్లేస్‌‌లో నిలిచింది.  2018 ఫిబ్రవరి తర్వాత తిరిగి టాప్‌‌ ప్లేస్‌‌కు చేరగా ఓవరాల్‌‌గా ఎనిమిదో సారి నంబర్‌‌ వన్‌‌ ర్యాంక్‌‌ సాధించింది. ఇంగ్లండ్‌‌తో జరిగిన మూడు వన్డేల సిరీస్‌‌ను మిథాలీ ఎనిమిదో ర్యాంక్‌‌తో మొదలుపెట్టింది. అయితే, హ్యాట్రిక్‌‌ హాఫ్‌‌సెంచరీలతో అదరగొట్టిన ఇండియా కెప్టెన్‌‌ టాప్‌‌ ప్లేస్‌‌కు దూసుకెళ్లింది. 2005 ఏప్రిల్‌‌లో మిథాలీ తొలిసారి నంబర్‌‌ వన్‌‌ ర్యాంక్‌‌ సాధించింది. తాజాగా మరోసారి టాప్‌‌ ర్యాంక్‌‌ దక్కించుకుంది. ఈ రెండు పర్యాయాల నడుమ 16 ఏళ్ల గ్యాప్‌‌ ఉంది.  ఇంత లాంగ్​ టైమ్​నంబర్​ వన్​ ర్యాంక్​ను మెయింటేన్​ చేసిన ఫస్ట్​ ప్లేయర్​ మిథాలీనే కావడం గమనార్హం. ఇంగ్లండ్‌‌కు చెందిన జెనెట్టీ బ్రిటిన్‌‌ 1984లో తొలిసారి నంబర్‌‌వన్‌‌ ర్యాంక్‌‌ సాధించగా...  చివరిగా 1995లో టాప్‌‌ ప్లేస్‌‌ దక్కించుకుంది. ఇక, ఇంగ్లండ్‌‌ సిరీస్‌‌తో వన్డేల్లో డెబ్యూ చేసిన షెఫాలీ వర్మ 71వ ర్యాంక్‌‌ సాధించింది.   జులన్‌‌ గోస్వామి నాలుగు స్థానాలు మెరుగుపర్చుకుని 53వ ర్యాంక్‌‌కు చేరింది. ఇక, బౌలర్‌‌ ర్యాంకింగ్స్‌‌లో  ఆల్‌‌రౌండర్‌‌ దీప్తి శర్మ ఒక ప్లేస్ మెరుగై 12వ ర్యాంక్‌‌లో నిలిచింది.