మియాపూర్ రోడ్డు వెంట ఆక్రమణల తొలగింపు..త్వరలో మియాపూర్ టూ అల్విన్ క్రాస్ రోడ్డు వరకు ఫ్లైఓవర్

మియాపూర్ రోడ్డు వెంట ఆక్రమణల తొలగింపు..త్వరలో మియాపూర్ టూ అల్విన్ క్రాస్ రోడ్డు వరకు ఫ్లైఓవర్

మియాపూర్, వెలుగు: మియాపూర్​మెయిన్​రోడ్డు వెంట ఉన్న ఫర్నిచర్​షాపులు, గుడిసెలను భారీ పోలీసు బందోబస్తు మధ్య సైబరాబాద్​మున్సిపల్​కార్పొరేషన్​అధికారులు గురువారం జేసీబీలతో తొలగించారు. తమకు ముందస్తు సమాచారం ఇవ్వకుండానే తొలగిస్తున్నారని షాపుల నిర్వాహకులు అధికారులతో వాగ్వాదానికి దిగారు. త్వరలో మియాపూర్​నుంచి అల్విన్​క్రాస్​ రోడ్డు వరకు ఫ్లైఓవర్, అండర్ పాస్​ నిర్మాణ పనులను ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమానికి సీఎం వస్తున్న నేపథ్యంలో రోడ్డును క్లియర్​ చేస్తున్నట్లు తెలుస్తోంది.