బీజేపీ ప్రయోగిస్తున్న పావు.. ప్రవీణ్

బీజేపీ ప్రయోగిస్తున్న పావు.. ప్రవీణ్

రాజ్యాధికారం అంటే అర్థం ఏంటో ప్రవీణ్ కుమార్ సమాధానం చెప్పాలన్నారు ఎమ్మెల్యే లు గాదరి కిషోర్. ప్రవీణ్ కుమార్ కు ఏదైనా పదవి ఇచ్చి కూర్చోపెడితే రాజ్యాధికారం వచ్చినట్లా  అన్నారు. తెలంగాణ ఉద్యమంలో ఉస్మానియా యూనివర్సిటీలో ఉద్యమ కారులను నువ్వు అణిచి వేయలేదా అన్నారు.  బీఎస్పీ సిద్దాంతం ఏంటి.. ఆయన బీఎస్పీలో ఎందుకు చేరాడో చెప్పలేదన్నారు. దళితబంధుకు ప్రవీణ్ కుమార్ వ్యతిరేఖమా..దళిత జాతిని బాగుచేసి దళితబంధు తెస్తే దళిత మేధావులే వ్యతిరేకిస్తే ఎట్లా అన్నారు. కోటు వేసుకొని తిరిగితే అందరూ అంబేద్కర్ అయిపోతరా అని..కేసీఆర్ ను విమర్షించే ముందు ప్రవీణ్ కుమార్ ఆలోచించుకోవాలన్నారు. 


ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ తనను తాను రక్షించుకోవడానికి ఉద్యోగానికి రాజీనామా చేశారని.. కలరింగ్ మాత్రం రాజ్యాధికారం కోసం అని చెబుతున్నాడన్నారు. గురుకుల్ స్కూల్ లు పెట్టాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని తెలిపారు. బీజేపీని, కేంద్ర ప్రభుత్వాన్ని, మోడీని ప్రవీణ్ కుమార్ ఎందుకు విమర్శించలేదన్నారు. బీజేపీ తల్లి పార్టీ, బీఎస్పీ పిల్ల పార్టీ అన్నారు. దళితులు బాగుపడతారు అనగానే ఇట్లాంటి వాడు ఒకడు బయటికి వచ్చి గంద రగోళానికి గురిచేస్తరన్నారు. ఇట్లాంటి పార్టీలు వస్తుంటాయి..పోతుంటాయని..బీజేపీ ప్రయోగిస్తున్న పావు ప్రవీణ్, ప్రాంతీయ పార్టీలను విచ్ఛిన్నం చేసేందుకు ప్రవీణ్ ను వాడుకుంటున్నారన్నారు. తెలంగాణలో సుస్థిర పాలనను విచ్ఛిన్నం చేసేందుకు బీజేపీ పన్నిన కుట్రలో భాగంగా ప్రవీణ్ కుమార్ వచ్చాడని చెప్పారు. బీజేపీ మద్దతుతోనే మాయావతి సీఎం అయ్యారని..భవిష్యత్ లో ప్రవీణ్ కుమార్ జాగ్రత్తగా ఉండకపోతే ఉద్యమాలను అణిచివేసిన రక్కసిగా పరిగణలోకి తీసుకుంటామన్నారు.