నాంపల్లి, వెలుగు: నాంపల్లి మండలం ఫకీర్‌పురం గ్రామానికి చెందిన ముదిగొండ యాదయ్య (23) తీవ్ర అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతుండగా, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరోసారి తన పెద్ద మనసును చాటుకున్నారు.
విషయం తెలుసుకుని వెంటనే స్పందించిన ఆయన జూబ్లీహిల్స్‌లోని అపోలో ఆస్పత్రిలో మెరుగైన వైద్యం అందేలా ఏర్పాట్లు చేయడమే కాకుండా, సుమారు రూ.18 లక్షలు వెచ్చించారు. ఎమ్మెల్యే చొరవ వల్లే తమ కుమారుడు పునర్జన్మ పొందారంటూ యాదయ్య కుటుంబ సభ్యులు, ఫకీర్‌పురం గ్రామస్తులు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు.
