- చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం
కరీంనగర్ టౌన్, వెలుగు: తూకంలో తరుగు పేరిట రైస్ మిల్లర్లు రైతులను ఇబ్బంది పెడితే ధర్నాకు దిగుతామని డీసీసీ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం హెచ్చరించారు. సోమవారం కలెక్టరేట్‌లో రైతు సమస్యలపై కలెక్టర్ చిత్రా మిశ్రాతో ఎమ్మెల్యే భేటీ -అయి మీడియాతో మాట్లాడారు. కేంద్ర జీపీఎస్ విధానం వల్లే లారీల కొరత ఏర్పడిందన్నారు.
ప్రతి కొనుగోలు కేంద్రంలో ప్రత్యేక అధికారి నియమించాలని డిమాండ్ చేశారు. ధాన్యం కొనుగోళ్లలో కోతలు లేకుండా చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. కరీంనగర్ జిల్లా సర్పంచుల ఫోరం మాజీ అధ్యక్షుడు అంజన్ ప్రసాద్, యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు ముత్యం శంకర్, లీడర్లు కె.రమేశ్, జి.హరీశ్ తదితరులు ఉన్నారు.
