వరంగల్, వెలుగు: ''గ్రేటర్ హనుమకొండ బాలసముద్రంలో బీఆర్‍ఎస్ నేతలు పార్టీ ఆఫీస్ పేరుతో రూ.200 కోట్ల భూములు కబ్జా జరిగితే ఆర్టీఐ కింద సమాచారం మాట్లాడుతుంటే చర్యల్లేవ్ అధ్యక్షా. నేను ఈ పార్కు స్థలాన్ని కబ్జా చేసినట్లు నిరూపించకుంటే 24 గంటల్లో నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా. నిరూపిస్తే కేటీఆర్, హరీశ్వు రాజీనామా చేస్తారా చెప్పాలే’’ అంటూ ఆదివారం అసెంబ్లీలో వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి సవాల్ విసిరారు.
తాను ఇంతగనం మొత్తుకుంటుంటే కబ్జాలు చేసినవారిని ఎందుకు జైల్లో పెడ్తలేరో అర్థం కావట్లే అధ్యక్షా. రూ.200 కోట్ల విలువైన భూముల్లోని పార్టీ ఆఫీస్‍ను కూల్చేసి వాటిని గవర్నమెంట్ స్వాధీనం చేస్కోవాలని స్పీకర్ ని కోరారు. దీనిపై ముఖ్యమంత్రి హౌజ్ కమిటీ లేదా సీబీఐ విచారణ వేయాలని అన్నారు. తన రాజీనామా లెటర్ స్పీకర్‌కు పంపిస్తున్నా అని, తాను కబ్జాను ప్రూవ్ చేస్తానని స్పష్టం చేశారు. అది కాదని దమ్ముధైర్యముంటే కేటీఆర్, హరీశ్‌రావు రాజీనామా లెటర్ పంపాలని సవాల్ చేశారు.
