- ఎమ్మెల్యే రాజ్‌ఠాకూర్
గోదావరిఖని, వెలుగు: రామగుండం కార్పొరేషన్‌లో మరింత అభివృద్ధి జరగాలంటే కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్‌ఠాకూర్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. బుధవారం బల్దియా పరిధిలోని పలు డివిజన్లకు చెందిన లీడర్లు కాంగ్రెస్‌లో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రామగుండం అభివృద్ధే ధ్యేయంగా ముందుకు సాగుతున్నామని, కాంగ్రెస్ అభ్యర్థుల విజయానికి ప్రతిఒక్కరూ కృషి చేయాలన్నారు. చేరిన వారిలో మాజీ కో ఆప్షన్‌సభ్యుడు వంగ శ్రీనివాస్, 44వ డివిజన్‌కు చెందిన బీఆర్‌ఎస్ యూత్ వింగ్ సభ్యులు పెద్ద సంఖ్యలో కాంగ్రెస్‌లో చేరారు. వారికి ఎమ్మెల్యే కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఇప్పటికే 33వ డివిజన్ బీఆర్ఎస్ అభ్యర్థి కుమ్మరి శ్రీనివాస్, 36వ డివిజన్ బీఆర్ఎస్ అభ్యర్థి గాదం విజయ, లీడర్లు పీఎస్ అమరేందర్, మాజీ కార్పొరేటర్ సింహాచలం రత్నాకర్, మాజీ కో ఆప్షన్ సభ్యుడు ఎండీ రఫీక్, బిజినెస్మెన్ తూముల రాజేశ్వర్‌రావు చేరడంతో కాంగ్రెస్ బలం పెరిగింది.
