ధాన్యం కొనుగోళ్లపై బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం : పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి

ధాన్యం కొనుగోళ్లపై బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం : పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లపై బీఆర్ఎస్ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి ఫైర్​అయ్యారు. మంగళవారం సీఎల్పీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర చరిత్రలోనే ఎప్పుడూ లేని విధంగా ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశామని, ఇప్పటివరకు రూ.6,462 కోట్లు రైతుల ఖాతాలో వేశామని తెలిపారు. ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ధాన్యం కొనుగోళ్లపై అసత్యాలు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నం మానుకోవాలని హితవు పలికారు.