మైనార్టీలపై బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చిన్నచూపు : సీతక్క

మైనార్టీలపై బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చిన్నచూపు : సీతక్క

ములుగు/మంగపేట, వెలుగు : బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రభుత్వం మైనార్టీలను చిన్నచూపు చూస్తోందని, వారికి 12 శాతం రిజర్వేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కల్పిస్తామని చెప్పి మోసం చేశారని మహిళా కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్యే సీతక్క విమర్శించారు. ములుగు జిల్లా గోవిందరావుపేట, మంగపేట మండలంలోని పలు గ్రామాల్లో శుక్రవారం ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ములుగు ప్రాంత సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తున్నానని చెప్పారు.

ప్రజల కష్టసుఖాల్లో పాలుపంచుకోవడం అధికార పార్టీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారని విమర్శించారు. ఎవరెన్ని కుట్రలు చేసినా వచ్చే ఎన్నికల్లో తనను గెలిపించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. మీ ఇంటి ఆడబిడ్డగా వచ్చిన తనను ఆదరించి గెలిపించాలని కోరారు.

మంగపేట వద్ద గోదావరికి కరకట్ట నిర్మాణం కోసం అసెంబ్లీలో ప్రశ్నించినా మంత్రులు పట్టించుకోలేదన్నారు. ఆయా కార్యక్రమాల్లో పాలడుగు వెంకటకృష్ణ, జెట్టి సోమయ్య, తేళ్ల హరిప్రసాద్​, పన్నాల ఎల్లారెడ్డి, --మైల జయరాంరెడ్డి, ఆక రాధాకృష్ణ, గుమ్మడి సోమయ్య, అయ్యోరి యానయ్య, చెట్టుపల్లి వెంకటేశ్వర్లు, నాసిరెడ్డి సాంబశివారెడ్డి పాల్గొన్నారు.