నిరుపేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం : ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి

నిరుపేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం : ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి

వనపర్తి, వెలుగు :  నిరుపేదల సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు సాగుతోందని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి అన్నారు. మంగళవారం తన క్యాంపు కార్యాలయంలో వనపర్తి నియోజకవర్గ పరిధిలోని 8 మండలాలు, 2 మున్సిపాలిటీలకు చెందిన 178 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి సహాయనిధి, కల్యాణలక్ష్మి లాంటి పథకాల ద్వారా అర్హులకు ఎప్పటికప్పుడు ఆర్థిక సాయం అందిస్తున్నామని, ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి రూ. 5 లక్షల ఆర్థిక సాయం అందిస్తూ నిరుపేదల సొంతింటి కలను ప్రభుత్వం నెరవేరుస్తోందని పేర్కొన్నారు. మున్సిపల్ చైర్‌ పర్సన్ మాధవి రమేశ్, వైస్ చైర్​పర్సన్ మధుసూదన్ గౌడ్, నాయకులు పాల్గొన్నారు.