
- రాష్ట్ర అవతరణ వేడుకలు ఘనంగా నిర్వహించాలి
- సోనియా స్పెషల్ గెస్ట్‌గా హాజరవుతరు: బల్మూరి వెంకట్
హైదరాబాద్, వెలుగు : జూన్ 2న రాష్ట్ర అవతరణ దినోత్సవాలను ఘనంగా నిర్వహించాలని, అందుకు తగిన ఏర్పాట్లు చేయాలని ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ అన్నారు. తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీని ఈ వేడుకలకు స్పెషల్ గెస్ట్‌గా ఆహ్వానించామని తెలిపారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వారందరినీ పార్టీలకు అతీతంగా వేడుకల్లో పాల్గొనేందుకు పిలుస్తున్నామని చెప్పారు. ఈ మేరకు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో నిర్వహించనున్న వేడుకలకు సంబంధించిన ఏర్పాట్లను ప్రజా ప్రతినిధులు, కాంగ్రెస్ నేతలు, జీహెచ్ఎంసీ అధికారులతో కలిసి బుధవారం పరిశీలించారు.
స్టేజ్, వీఐపీ, విజిటర్స్ గ్యాలరీలు, పార్కింగ్ ప్లేస్‌ను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. తర్వాత ట్యాంక్‌బండ్‌కు వెళ్లి అక్కడ జరుగుతున్న ఏర్పాట్లను చూశారు. ఈ సందర్భంగా బల్మూరి వెంకట్ మీడియాతో మాట్లాడారు. అవతరణ దినోత్సవం రోజు సాయంత్రం ట్యాంక్‌బండ్‌పై తెలంగాణ ఆట.. పాట నిర్వహిస్తున్నట్టు తెలిపారు. అదేవిధంగా స్టాల్స్ కూడా ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు.