V6 News

మాధవరం.. నీ వెనకున్న గుంట నక్కను వదల.. కవిత వార్నింగ్

మాధవరం.. నీ వెనకున్న గుంట నక్కను వదల.. కవిత వార్నింగ్
  • ఇంకా టెస్ట్ మ్యాచ్ మిగిలే ఉంది
  • నేను మంచి దాన్ని కాదు..
  • నన్నేమైనా అంటే ఊకోను
  • బీఆర్ఎస్ సర్కారులో చాలా మిస్టేక్స్ చేసిండ్రు
  •  కృష్ణారావు మేం దాడి చేసేంత పెద్ద మనిషి కాదు

హైదరాబాద్: కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, బీజేపీ ఎమ్మెల్యే మహే శ్వర్ రెడ్డి వెనుక ఉన్న గుంట నక్కను వదల బోనని ఎమ్మెల్సీ కవిత అన్నారు. తాను ఇప్పటి వరకు టాస్ మాత్రమే వేశానని, చిట్టా విప్పుతా నంటూ హరీశ్ రావు టార్గెట్ గా సంచలన వ్యా ఖ్యలు చేశారు. ముందు ముందు టెస్ట్ మ్యాచ్ ఉందని అన్నారు. తన భర్తపై లేని పోని ఆరో పణలు చేసిన వారిని వదలబోనని చెప్పారు. తప్పుడు కథనాలను ప్రసారం చేసిన చానల్ కు. ఎమ్మెల్యేలు మాధవరం కృష్ణారావు, మహే శ్వర్ రెడ్డికి లీగల్ నోటీసులు పంపుతున్నట్టు ఆమె చెప్పారు.

 ఇవాళ (శుక్రవారం (డిసెంబర్ 12) బంజారాహిల్స్ లోని జాగృతి కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు. తన భర్త ఏవీరెడ్డితో భూలావా దేవీలు చేశారని అంటున్నదన్నారు. తాము ఏ మంత్రి దగ్గరకూ వెళ్లి లాబయింగ్ చేసుకోలేద ని చెప్పారు. మాధవరం ఆరోపిస్తున్న ల్యాండ్ నుంచి తన భర్త అనిల్ 2019లోనే బయటకు వచ్చారని, ఆ భూమికి 2022లో అప్పటి బీఆ ర్ఎఎస్ ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చిందని, కేటీఆర్ సంతకం చేశారని అన్నారు. వాళ్ల దాష్టీకాలు బయటపడుతున్నాయని, కొన్ని గుంట నక్కలు తనపై ఎదురు దాడి చేస్తున్నాయని అన్నారు.

 తన నగలు కుదువ పెట్టి బతుకమ్మ ఉత్సవాలు చేశానని, అందుకే తనకు పౌరుషం ఎక్కువని అన్నారు. హరీశ్ రావు తనపై ఏం దుష్ప్రచా రం చేయాలనుకుంటున్నారో అదే విషయం మహేశ్వర్ రెడ్డి, కృష్ణారావు నోటి నుంచి వస్తోందని అన్నారు. బీఆర్ఎస్ హయాంలో ఐదెకరాల ఇండస్ట్రియల్ ల్యాండ్ ను రెసిడెన్షి యల్ భూమిగా మార్చుతూ అనుమతి ఇచ్చా రని అన్నారు. ఆ ల్యాండ్ కు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా పర్మిషన్ ఇచ్చిందని చెప్పారు. దీనిపైమాధవరం కృష్ణారావు సమాధానం చెప్పాల నిడిమాండ్ చేశారు. 

ఆ భూమికి సంబంధం ఉన్న ఏవీ రెడ్డి, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి పార్ట్ నర్స్ అని, వీళ్లిద్దరూ నవనామీ వెంచర్స్ నడుపుతున్నారని క్లారిటీ ఇచ్చారు. పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి కేటీఆర్ కు ప్రధాన అనుచరుడని అన్నారు. తనపై ఎక్కువ తక్కువ మాట్లాడితే తోలు తీస్తానని చెప్పారు. మాధవరం కృష్ణారావు కుమారుడు చెరువు భూములు కబ్జా చేశారని ఆరోపించారు. చారు. మాధవరం కృష్ణారావు తాము దాడి చేసేంత అంత పెద్ద మనిషి కాదన్నారు.