ఇన్ సర్వీస్ టీచర్లకు టెట్ మినహాయించాలి : టీచర్ ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్ రెడ్డి

ఇన్ సర్వీస్ టీచర్లకు టెట్ మినహాయించాలి : టీచర్ ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్ రెడ్డి
  • కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్​కు ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డి వినతి

హైదరాబాద్, వెలుగు: ఇన్ సర్వీస్  టీచర్లను ‘టెట్’ నుంచి మినహాయించాలని కేంద్ర ప్రభు త్వాన్ని టీచర్ ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్ రెడ్డి కోరారు. టీచర్ల సర్వీస్​లో కొనసాగాలన్నా..  ప్రమోషన్ పొందాలన్నా టెట్ క్వాలిఫై కావాలన డం సరికాదని చెప్పారు. సోమవారం ఢిల్లీలో పీఆర్టీయూటీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు పుల్గం దామో దర్​తో కలిసి ఆయన కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్​ను కలిశారు. టీచర్ల సమస్యలపై మంత్రికి వినతిపత్రం అందించారు.

 ఇన్ సర్వీస్  టీచర్లకు కూడా టెట్  తప్పనిసరి చేస్తూ ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో టీచర్లు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. ఏండ్ల తరబడి విధుల్లో ఉన్న వారికి ఇప్పుడు పరీక్ష నిర్వహించడం సరికాదన్నారు. టీచర్ల సమస్యను సానుభూతితో పరిశీలించి, టెట్  నిబంధన నుంచి వారికి వెసులుబాటు కల్పించాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై ధర్మేంద్ర ప్రధాన్ సానుకూలంగా స్పందించారని వారు తెలిపారు.