ఎమ్మెల్సీ ఎన్నికలు: ప్రారంభమైన పోలింగ్

ఎమ్మెల్సీ ఎన్నికలు: ప్రారంభమైన పోలింగ్

MLA కోటాలో జరుగుతున్న 5 ఎమ్మెల్సీ స్థానాలకు పోలింగ్ ప్రారంభమైంది. 9 గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు పోలింగ్ జరగనుంది. మొత్తం ఐదు స్థానాలకు నాలుగింటిలో TRS పోటీ చేస్తుండగా….ఒక స్థానాన్ని మిత్రపక్షం అయిన MIMకు కేటాయించింది TRS. అయితే ఓటింగ్ లో పాల్గొనే ముందు TRS భవన్ లో మాక్ పోలింగ్ లో పాల్గొన్నారు పార్టీ నేతలు. ఆ తర్వాత మూడు బస్సుల్లో అసెంబ్లీకి బయలుదేరి వెళ్లారు. సాయంత్రం 5 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. 

తెలంగాణ భవన్ నుంచి MLAలతో పాటే బస్సులో అసెంబ్లీకి వెళ్లారు TRS పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ KTR. అయితే ఒక్కరిద్దరు MLAలు ఆరోగ్యం సరిగ్గా లేకపోవటంతో డైరెక్ట్ గా అసెంబ్లీకి చేరుకున్నప్పటికీ…..అందరితో కలిసి ఓటింగ్ లో పాల్గొన్నారు. తొలి ఓటు స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి వేయగా రెండో ఓటును పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్…మూడో ఓటును మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి వినియోగించుకున్నారు. అటు MIM MLAలు ముందుగా అసెంబ్లీకి చేరుకొని అక్కడి నుంచి ఓటింగ్ కు వెళ్లారు. కాసేపట్లో సీఎం కేసీఆర్ కూడా ఓటు వేయనున్నారు.