ఎమ్మెల్సీ ఫలితాలు: TRS-4,MIM-1

ఎమ్మెల్సీ ఫలితాలు: TRS-4,MIM-1

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో అంతా అనుకున్నట్టే జరిగింది. ఎన్నికల జరిగిన ఐదు స్థానాల్లో టీఆర్ఎస్ నాలుగు, MIM ఒక్కటి గెలిచింది. కాంగ్రెస్ పోటీలో ఉన్నా…ఓటింగ్ కు దూరంగా ఉంది. బీజేపీ, టీడీపీ కూడా ఓటింగ్ కు దూరంగా ఉన్నాయి. దీంతో గెలుపు లాంఛనమే అయింది. TRS నుంచి  హోంమంత్రి మహముద్ అలీ, శేరి సుభాష్ రెడ్డి, ఎగ్గె మల్లేశం, సత్వవతి రాథోడ్ గెలిచారు. మజ్లిస్ నుంచి రియాజ్  విజయం సాధించారు.

98మంది మంది ఎమ్మెల్యేలు ఓటు వేశారు. స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, ముఖ్యమంత్రి కేసీఆర్ తో పాటు TRS, MIM ఎమ్మెల్యేలు ఓటు హక్కు వినియోగించుకున్నారు. నామినేటెడ్ ఎమ్మెల్యే స్టిఫెన్ సన్ కూడా ఓటు వేశారు. టీఆర్ఎస్ లో చేరతామని ప్రకటించిన ఆత్రం సక్కు, రేగా కాంతరావు, చిరుమర్తి లింగయ్య, హరిప్రియా నాయక్ ఓటు వేయలేదు. TDP ఎమ్మెల్యేలు సండ్ర వెంకటవీరయ్య, మచ్చా వెంకటేశ్వర్లు, బీజేపీ సభ్యుడు రాజాసింగ్ ఓటింగ్ కు దూరంగా ఉన్నారు.