హైదరాబాద్ సిటీ, వెలుగు: పారిశుధ్య నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే రాంకీ సంస్థపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎంఎంసీ కమిషనర్ వినయ్ కృష్ణా రెడ్డి హెచ్చరించారు. శనివారం దేవేంద్ర నగర్, నల్లచెరువు, ఉప్పల్ ప్రాంతాల్లో ఆయన పర్యటించారు. చర్చ్ కాలనీ రోడ్లలో పారిశుధ్యం అధ్వానంగా ఉండటంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. చెత్తను వెంటనే తొలగించాలని ఆదేశించారు. ఎంటమాలజీ సిబ్బందికి యాంటీ లార్వల్ ఆపరేషన్స్ ముమ్మరం చేయాలని సూచించారు.
అలాగే దేవేంద్ర నగర్ నాలా వెంట జరిగిన భూ ఆక్రమణలపై టౌన్ ప్లానింగ్ ఏసీపీ సమగ్ర విచారణ చేపట్టాలని ఆదేశించారు. ఉప్పల్ నల్లచెరువు వద్ద ఎస్ఎన్డీపీ నాలా అభివృద్ధి పనులకు అడ్డంగా ఉన్న 106 నిర్మాణాల యజమానులకు నోటీసులు జారీ చేయాలని, టీడీఆర్ ప్రక్రియను వేగవంతం చేసి ఆక్రమణలను తొలగించడం ద్వారా ప్రాజెక్టును గడువులోగా పూర్తి చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.
