- ఎక్స్ పో గెలాక్సియా ఫౌండర్ డైరెక్టర్ రాఖీ ముఖర్జీ
హైదరాబాద్, వెలుగు: చిన్నారుల్లో మొబైల్మేనియా పెరిగితున్నదని ఎక్స్ పో గెలాక్సియా ఫౌండర్డైరెక్టర్ రాఖీ ముఖర్జీ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు శనివారం స్కూల్అండ్ఆఫీస్ఎక్స్పో సందర్భంగా పలు స్కూళ్ల విద్యార్థులకు డ్రాయింగ్, పెయింటింగ్ పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా రాఖీ ముఖర్జీ మాట్లాడారు. చిన్నారులకు ఫోన్లు ఇచ్చి తల్లిదండ్రులు పనుల్లో నిమగ్నమవుతున్నారని ఫలితంగా రెండేండ్ల నుంచే చిన్నారులకు రీల్స్, యూట్యూబ్ వ్యాపకంగా మారిందని తెలిపారు. డ్రాయింగ్, పెయింటింగ్ లో వారిని ప్రోత్సహించి సృజనాత్మకశక్తిని పెంపొందించాల్సిన అవసరం ఉందని చెప్పారు.
కలర్పెన్సిల్స్, పెయింట్స్ వంటి స్టేషనరీ ఉత్పత్తులు అందించి వారిలో పెయింటింగ్ పై అభిరుచిని పెంచాలని సూచించారు. అప్పుడే మొబైల్ ఫోన్ల నుంచి దృష్టిని మరలించడం సాధ్యమవుతుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా వివిధ స్కూళ్లకు చెందిన విద్యార్థులకు పెయింటింగ్కాంపిటీషన్నిర్వహించారు. .
