హైదరాబాద్ సిటీ, వెలుగు: శంషాబాద్ ఎయిర్‌పోర్టులో మంగళవారం లగేజీ చెక్ చేస్తుండగా ఓ ప్రయాణికుడి బ్యాగ్ లోని సెల్ ఫోన్ బ్యాటరీ ఒక్కసారిగా పేలిపోయింది. దీంతో అక్కడున్న ప్రయాణికులు భయంతో తలోదిక్కుకు పరుగులు తీశారు. హైదరాబాద్ నుంచి ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్ వెళ్లేందుకు ఓ ప్యాసింజర్ ఎయిర్‌పోర్టుకు వచ్చాడు.
విమానం ఎక్కే ముందు సీఐఎస్‌ఎఫ్ సిబ్బంది అతడి లగేజీని తనిఖీ చేస్తుండగా బ్యాగులో పెట్టుకున్న సెల్‌ఫోన్ బ్యాటరీ ఒక్కసారిగా పేలిపోయింది. మంటలు, పొగ రావడంతో ప్రయాణికులు భయంతో వణికుతూ బాంబు పేలిందేమోనని పరుగులు తీశారు. ఎయిర్ పోర్టు భద్రతా సిబ్బంది అప్రమత్తమై ఏం జరగలేదని అనౌన్స్‌చేశారు. సెల్ఫోన్చార్జర్పేలిందని, ఎవరికీ గాయాలు కాలేదని చెప్పి శాంతపర్చారు.

