నాలుగు లైట్లు, ఫ్యానుకు రూ.7లక్షల కరెంట్ బిల్లు

నాలుగు లైట్లు, ఫ్యానుకు రూ.7లక్షల కరెంట్ బిల్లు

నాలుగు ట్యూబ్ లైట్లు, ఒక ఫ్యాను ఉన్న ఓ మొబైల్ షాపుకి 7 లక్షల కరెంట్ బిల్లు వచ్చింది. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మండలంలో ఓ చిన్న మొబైల్ షాపు ఉంది. మాములుగా అయితే నాలుగు లైట్లు, ఒక ఫ్యాన్ ఉంటే వంద నుంచి 150 బిల్లు వస్తుంది. అయితే ఈ షాపుకి 33 రోజులకు 4 లక్షల 29 వేల యూనిట్లు కాలినట్లు రీడింగ్ వచ్చింది. దీనికి 7లక్షల 29 వేల 442 బిల్లు రావడంతో షాపు యాజమాని షాక్ అయ్యాడు.