జీడిమెట్ల, వెలుగు: దవాఖానలో చికిత్స పొందుతున్న పేషెంట్ వద్ద మొబైల్ ఫోన్ దొంగిలించి, ఫోన్‌పే ద్వారా రూ.8 లక్షలు కాజేసిన వ్యక్తిని సూరారం పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. సీఐ సుధీర్ కృష్ణ తెలిపిన వివరాల ప్రకారం.. మెదక్ జిల్లా కౌడిపల్లి గ్రామానికి చెందిన బూరడ ఆదినారాయణ(34) సెంట్రింగ్ పనులు చేస్తుంటాడు.
జనవరి 7న మల్లారెడ్డి హాస్పిటల్లో చికిత్స పొందుతున్న పేషెంట్ ప్రవీణ్‌కుమార్ వద్ద ఫోన్‌ను దొంగిలించాడు. అనంతరం ఫోన్‌పే ద్వారా రూ.8 లక్షలు ట్రాన్సఫర్ చేసుకున్నాడు. కేసు నమోదు చేసిన పోలీసులు మంగళవారం నిందితుడిని అరెస్ట్ చేశారు. సెల్‌ఫోన్‌తో పాటు రూ.6.73 లక్షలు రివకరీ చేశారు.
