జగిత్యాలలో మోడల్ స్కూల్ విద్యార్థుల ఆందోళన

జగిత్యాలలో మోడల్ స్కూల్ విద్యార్థుల ఆందోళన

జగిత్యాల జిల్లా మల్లాపూర్ లో మోడల్ స్కూల్ విద్యార్థినులు ఆందోళనకు దిగారు. స్కూల్లో, కాలేజీల్లో కనీస సౌకర్యాలు లేవని రోడ్డుపైకి వచ్చి నిరసన చేస్తున్నారు. ఆరోగ్య సమస్యలు వస్తే చెప్పుకునేందుకు కేర్ టేకర్, ఏఎన్ఎంలు కూడా లేరని అంటున్నారు. కనీసం హాస్టళ్లో  తాగునీరు కూడా సరిగ్గా లేవంటున్నారు. సీజనల్ వ్యాధుల టైంలో హాస్టల్లో దోమలతో ఇబ్బంది పడుతున్నామని చెప్తున్నారు విద్యార్థినులు.

కనీసం జ్వరం, జలుబు, దగ్గు మందులు కూడా అందుబాటులో లేవంటున్నారు స్టూడెంట్స్. ఎంతో మంది విద్యార్థులకు జ్వరాలు, వైరల్ ఫీవర్స్ వస్తున్నా ఎవరూ పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు స్టూడెంట్స్. డీఈవో సహా అధికారులకు చెప్పినా ఎవరూ సీరియస్ గా తీసుకోవడం లేదంటున్నారు. చేసేది లేక.... చివరకు ఇలా రోడ్లపైకి వచ్చామంటున్నారు విద్యార్థులు.