నీట్ పేపర్ లీక్ వివాదంపై ఢిల్లీలో నిరసనలు కొనసాగుతున్న క్రమంలో పరీక్షల మోసాలను అరికట్టేందుకు కేంద్రం కఠిన చర్యలకు సిద్దమవుతోంది. పేపర్ లీకులను అడ్డుకునేందుకు కొత్త చట్టం తీసుకురానుంది. శుక్రవారం (జూలై 24) జరిగిన కేంద్ర కేబినెట్ మీటింగ్‌లో పేపర్ లీక్ నిరోధక ముసాయిదా బిల్లుకు ఆమోదం తెలిపింది. ఈ బిల్లు చట్టం అయితే పేపర్ లీక్ చేసినవారిపై కఠిన శిక్షలు అమలు చేయనున్నారు. ముసాయిదా బిల్లు ప్రకారం.. పేపర్‌లీక్ కేసులను మూడు నెలల్లో పరిష్కరించి దోషులుగా తేలితే పదేళ్లు జైలు శిక్ష, 10కోట్ల రూపాయల జరిమానా విధించేందుకు ప్రతిపాదించారు.
ఈ ప్రతిపాదిత చట్టం ప్రకారం.. పేపర్ లీక్ కేసులను మూడు నెలల్లోనే పరిష్కరించేలా ఓ ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయనున్నారు. తక్షణ న్యాయం, ఎగ్జామ్ నిర్వహణ వ్యవస్థపై నమ్మకాన్న బలోపేతం చేయడం ఈ చట్టం ముఖ్య ఉద్దేశమని కేబినెట్ తెలిపింది.
పదేళ్ల వరకు జైలు శిక్ష, రూ.10 కోట్ల జరిమానా..
ప్రతిపాదిత చట్టంలో పేపర్ లీక్ రాకెట్లతో సంబంధం ఉన్న వారికి కఠినమైన శిక్షలు అమలు చేయనున్నారు. ఈ కొత్త చట్టం కింద దోషులుగా తేలిన వారికి పదేళ్ళ వరకు జైలు శిక్ష పడవచ్చు. అదనంగా, రూ. 10 కోట్ల వరకు జరిమానాను ప్రతిపాదించారు.
ALSO READ : కేబినెట్ సమావేశంలో రెండు కీలక నిర్ణయాలు తీసుకున్న ప్రధాని మోదీ.. అవేంటంటే..
నీట్ పేపర్ లీక్‌పై దేశవ్యాప్తంగా ఆందోళనలు
నీట్-యూజీ పేపర్ లీక్‌పై దేశవ్యాప్తంగా నిరసనలు తీవ్రమవుతున్న క్రమంలో ఈ బిల్లును తీసుకొచ్చారు. పరీక్షల నిర్వహణలో మరింత జవాబుదారీతనం, సంస్కరణలు కావాలని డిమాండ్ చేస్తున్నారు. విద్యార్థుల భవిష్యత్తు భద్రతకు,కాంపిటిటివ్ ఎగ్జామ్స్సమగ్రతకు భంగం కలిగించే బాధ్యులకు కఠిన శిక్షలు పడేలా చేసేందుకుఉ తాము కట్టుబడి ఉన్నామని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.ఆమోదం పొందిన బిల్లున వచ్చే వారం పార్లమెంటులో ప్రవేశపెట్టి ఆమోదిస్తామని తెలిపింది.
