Drishyam 3 Collections: బాక్సాఫీస్ దగ్గర దుమ్మురేపుతున్న‘దృశ్యం 3’.. ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతంటే?

Drishyam 3 Collections: బాక్సాఫీస్ దగ్గర దుమ్మురేపుతున్న‘దృశ్యం 3’.. ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతంటే?

మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ నటించిన క్రైమ్ థ్రిల్లర్ ‘దృశ్యం 3’ దుమ్మురేపుతోంది. ప్రపంచవ్యాప్తంగా గురువారం (మే21న) విడుదలై బాక్సాఫీస్ వద్ద భారీ ఓపెనింగ్స్ సాధించింది. ప్రేక్షకులు, విమర్శకుల నుంచి మిక్సెడ్ టాక్ వచ్చినప్పటికీ, తొలి రోజే భారీ వసూళ్లతో దూసుకెళ్లింది. ఈ క్రమంలోనే మలయాళ ఇండ‍స్ట్రీలో రెండో బిగ్గెస్ట్‌ ఓపెనర్‌గా ఘనత సాధించింది.

ట్రేడ్ వెబ్‌సైట్ సాక్నిల్క్ ప్రకారం, దృశ్యం 3 ఫస్ట్ డే (మే21) ఇండియా వైడ్ రూ.15.85 కోట్ల నెట్ వసూళ్లు సాధించింది. రూ.18.37 కోట్ల గ్రాస్  కలెక్షన్లు రాబట్టింది. ముఖ్యంగా, ఓవర్సీస్ మార్కెట్ నుంచే రూ.25 కోట్ల వసూళ్లు రాబట్టి సత్తా చాటింది. ఓవరాల్ ప్రపంచవ్యాప్తంగా తొలిరోజే రూ.43.37కోట్లకు పైగా కలెక్షన్స్‌తో రికార్డ్ క్రియేట్ చేసింది.

మలయాళ వెర్షన్ అత్యధికంగా రూ.13.70 కోట్ల నెట్ వసూళ్లతో టాప్లో నిలిచింది. తెలుగు వెర్షన్ కొన్ని సెలెక్టెడ్ థియేటర్స్లో రిలీజైనప్పటికీ.. పాసిటివ్ టాక్ అందుకుంది. తొలి రోజు రూ.1.50 కోట్ల నెట్ వసూళ్లు రాబట్టింది. ముఖ్యంగా సాయంత్రం, రాత్రి షోలలో ప్రేక్షకుల రద్దీ ఎక్కువగా కనిపించింది.

ఈ సినిమాకి ఫస్ట్ డే కంటే సెకండ్ డే మౌత్ టాక్ ఊపందుకుంది. ఈ క్రమంలోనే మోహన్ లాల్ ఫ్యాన్స్ నుంచి థ్రిల్లర్ ఆడియన్స్ వరకు థియేటర్లో క్యూ కడుతున్నారు. అందువల్ల మేకర్స్ సైతం థియేటర్లు పెంచుతూ సినిమాపై మరింత హైప్ పెంచుతున్నారు. కేవలం 24 గంటల్లోనే 5 లక్షల 87 వేలకు పైగా టికెట్లు బుక్ అయ్యాయంటే అర్ధం చేసుకోండి. వీకెండ్ రచ్చ ఎలా ఉంటుందో అని. 

సెకండ్ బిగ్గెస్ట్ ఓపెనర్‌గా రికార్డు

దృశ్యం-3 తొలి రోజు భారీ వసూళ్లతో మలయాళ సినీ చరిత్రలో రెండో అతిపెద్ద ఓపెనింగ్ సాధించింది. రూ.28.10 కోట్ల గ్రాస్‌తో ఉన్న పేట్రియాట్ రికార్డును బీట్ చేసింది. ఈ చిత్రంలో మమ్ముట్టి, మోహన్‌లాల్ నటించగా, మహేష్ నారాయణన్ దర్శకత్వం వహించారు. అంతేకాదు.. మోహన్ లాల్ నుంచి ఇటీవల వచ్చిన పలు చిత్రాల ఫస్ట్ డే రికార్డులను కూడా దృశ్యం 3 అధిగమించింది.

ALSO READ : ఎన్టీఆర్ ‘డ్రాగన్’ తర్వాతే ప్రభాస్ ‘సలార్ 2’..

అయితే, మలయాళంలో ఫస్ట్ డే తొలి హయ్యెస్ట్ వసూళ్ల రికార్డు మాత్రం ఎల్2: ఎంపురాన్ పేరిటే ఉంది. అందులో కూడా మోహన్ లాల్ హీరో కావడం విశేషం. పృథ్వీరాజ్ సుకుమారన్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ మొదటి రోజే ప్రపంచవ్యాప్తంగా రూ.67 కోట్ల వసూళ్లు సాధించింది. దీంతో L2: ఎంపురాన్ తొలి రోజు రికార్డును మాత్రం దృశ్యం 3 (రూ.43.37కోట్లతో) అందుకోలేకపోయింది.