యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, సంచలనాల దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో వస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘డ్రాగన్’ (Dragon). ఇటీవల రిలీజ్ అయిన ఈ మూవీ గ్లింప్స్ రికార్డులు సృష్టిస్తూ అంచనాలను రెట్టింపు చేస్తోంది. దాదాపు 100 మిలియన్ డిజిటల్ వ్యూస్‌కు చేరువై ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పిస్తోంది. ఈ క్రేజ్ మధ్యే డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తన ఫ్యూచర్ ప్రాజెక్ట్స్‌పై లేటెస్ట్ గా ఒక ఇంటర్వ్యూలలో సెన్సేషనల్ అప్‌డేట్స్ ఇచ్చారు.
‘డ్రాగన్’ తో సరికొత్త మేకోవర్..
ఇప్పటివరకు ‘కేజీఎఫ్’, ‘సలార్’ చిత్రాలతో డార్క్, వైలెంట్ ప్రశాంత్ నీల్ సినిమాటిక్ యూనివర్స్‌ను చూసిన ప్రేక్షకులకు ‘డ్రాగన్’ సరికొత్త అనుభూతిని ఇవ్వబోతోంది. ఎన్టీఆర్ ఇందులో ‘లూగర్’ అనే పవర్‌ఫుల్ రోల్‌లో సబ్‌స్టాన్స్ స్మగ్లింగ్ సిండికేట్‌ను గడగడలాడించే పాత్రలో కనిపించనున్నారు. రుక్మిణీ వసంత్ హీరోయిన్‌గా నటిస్తుండగా, అనిల్ కపూర్, బిజు మీనన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. "డ్రాగన్" నా పాత సినిమాల్లాంటి డార్క్ థీమ్‌లో ఉండదు. ఇది కలర్‌ఫుల్ విజువల్స్, మైథలాజికల్ టచ్‌తో కూడిన సరికొత్త యాక్షన్ ఎంటర్టైనర్ అని నీల్ రివీల్ చేశారు. ఈ క్రేజీ ప్రాజెక్ట్ జూన్ 11, 2027న థియేటర్లను రూల్ చేయనుంది.
సలార్ 2 పై క్లారిటీ..
రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చేస్తున్న ‘సలార్: పార్ట్ 2 – శౌర్యాంగ పర్వం’ పై నీల్ క్రేజీ అప్‌డేట్ ఇచ్చారు. ‘డ్రాగన్’ పూర్తయిన వెంటనే తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ‘సలార్ 2’ మాత్రమేనని స్పష్టం చేశారు. ఖాన్సార్ సామ్రాజ్యంలో దేవా (ప్రభాస్), వరదరాజ మన్నార్ (పృథ్వీరాజ్ సుకుమారన్) మధ్య జరిగే భీకరమైన సింహాసన పోరాటాన్ని పార్ట్-2 లో మరింత వైలెంట్‌గా చూపించబోతున్నారు.
వరుస సినిమాలతో..
ప్రభాస్ ప్రస్తుతం హను రాఘవపూడి దర్శకత్వంలో పీరియడ్ డ్రామా ‘ఫౌజీ’ డిసెంబర్ 2026 రిలీజ్ కు రెడీ అవుతోంది. ఇక సందీప్ రెడ్డి వంగాతో మోస్ట్ అవైటెడ్ కాప్ డ్రామా ‘స్పిరిట్’ మార్చి 5, 2027 రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేశారు. వచ్చే ఏడాది మిడ్ లో ప్రభాస్ ‘స్పిరిట్’ను, నీల్ ‘డ్రాగన్’ను కంప్లీట్ చేసుకుంటారు. దీంతో 2027 ద్వితీయార్థంలో హోంబలే ఫిల్మ్స్ భారీ బడ్జెట్‌తో ‘సలార్ 2’ షూటింగ్‌ను పట్టాలెక్కిస్తుంది. ఈ ‘సలార్ 2’ మూవీ 2028లో థియేటర్లలోకి రానుంది.
ఇక ‘కేజీఎఫ్ 3’ గురించి అడిగితే.. ప్రస్తుతం యాష్, తాను వేర్వేరు ప్రాజెక్ట్స్‌తో బిజీగా ఉన్నామని, దానికింకా చాలా టైమ్ పడుతుందని నీల్ తేల్చేశారు. ఏదేమైనా ఎన్టీఆర్ ‘డ్రాగన్’తో మొదలై, ప్రభాస్ ‘సలార్ 2’తో ముగిసే ఈ మాసివ్ లైనప్ ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్ చేయడం ఖాయం అని సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి..
