దెబ్బతిన్న మూసారాంబాగ్ బ్రిడ్జి.. ఎక్కడ చూసినా చెత్తే

దెబ్బతిన్న మూసారాంబాగ్ బ్రిడ్జి.. ఎక్కడ చూసినా చెత్తే

మూసీ నదికి భారీగా ఇన్ ఫ్లో తగ్గింది. గురువారం మూసారాంబాగ్ బ్రిడ్జి కింద నుంచి నీటి ప్రవాహం కొనసాగుతోంది. అటు చాదర్ ఘాట్ చిన్న బ్రిడ్జికి ఒక అడుగు కింది నుంచి నీరు ప్రవహిస్తోంది. భారీ వరదతో మూసారాంబాగ్ బ్రిడ్జి చాలా వరకు దెబ్బతిన్నది. పెద్ద ఎత్తున చెత్తా చెదారం నిండి ఉంది. వాటిని తొలగించేందుకు జీహెచ్ఎంసీ రంగంలోకి దిగింది. బ్రిడ్జిని క్లీన్ చేసేందుకు దాదాపు 100 మంది జీహెచ్ఎంసీ సిబ్బంది శ్రమిస్తున్నారు. క్లీనింగ్ ప్రాసెస్ కొనసాగుతోంది. కొత్త బ్రిడ్జి నిర్మాణం కోసం ప్రయత్నాలు చేస్తామని నిన్న స్థానిక ఎమ్మెల్యే చెప్పారు. మూసారాంబాగ్ బ్రిడ్జిపై రాకపోకలకు ఇంకా సమయం పట్టే ఛాన్స్ ఉంది. ట్రాఫిక్ డైవర్షన్ కంటిన్యూ అవుతోంది. సేఫ్టీ కోసం ఏర్పాటు చేసిన ఫెన్సింగ్ కొట్టుకోపోయింది.

మరోవైపు...జంట జలాశయాలకు వరద తగ్గుతోంది. గండిపేట పూర్తిస్థాయి నీటిమట్టం 17వందల 90 ఫీట్లు కాగా.. ప్రస్తుతం 17వందల 87 ఫీట్ల నీటిమట్టం ఉంది. 2వేల 5వందల క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తుండగా.. 10 గేట్లు ఎత్తి 6వేల 90 క్యూసెక్కుల నీటిని వదిలిపెడుతున్నారు. గండిపేట చెరువు నీటి విడుదలతో మంచిరేవుల నుంచి నార్సింగికి వెళ్లే రోడ్డుపై వరద ప్రవహిస్తోంది. హిమాయత్ సాగర్ జలాశయం నిండుకుండలా మారింది. కానీ ఇన్ ఫ్లోలు భారీగా పడిపోయాయి. 4వందల క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తుండగా.. ఒక గేటు ఎత్తి 330 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.